శుక్రవారం 27 నవంబర్ 2020
Rajanna-siricilla - Jul 27, 2020 , 03:09:15

సామాజికవర్గ అభ్యున్నతికి పాటుపడాలి

సామాజికవర్గ అభ్యున్నతికి పాటుపడాలి

సిరిసిల్ల టౌన్‌: సామాజిక వర్గ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని మున్సిపల్‌ అధ్యక్షురాలు జిందం కళ తెలి పారు.  జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ సం ఘం భవనంలో జిల్లా మాదిగ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా మున్సిపల్‌ అధ్యక్షురాలు జిందం కళ హాజరయ్యారు. అధ్యక్షుడిగా ఎన్నికైన గడ్డం నాగరాజుతోపాటు కార్యవర్గ సభ్యులను జిందం కళ అభినందించి, మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం బహుజనుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మాదిగల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక రకాల ప్రోత్సాహకాలు అందిస్తున్నదని తెలిపారు.  ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో రాణించాలని సూచించారు. మాదిగ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గంలో అధ్యక్షుడు గడ్డం నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలకిషన్‌, ఉపాధ్యక్షులుగా కొమ్ము త్యాగరాజు, గొల్లపల్లి పరశురాములు, మెట్ట రాజు, కోశాధికారి చిలుముల ఎల్లయ్య, సంయుక్త కార్యదర్శులు కొమ్ము రవీందర్‌, నక్క సతీశ్‌, సలహాదారులు గడ్డం పరశురాములు, వడ్లూరి ఎల్లయ్య, ఆకునూరి రమేశ్‌లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, సెస్‌ చైర్మన్‌ దోర్నాల లక్ష్మారెడ్డి, మున్సిపల్‌ కౌన్సిలర్‌ ఆకునూరి విజయనిర్మల, కాంగ్రెస్‌ ఎస్సీసెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు పాల్గొన్నారు.