ఆదివారం 29 నవంబర్ 2020
Rajanna-siricilla - Jul 26, 2020 , 02:01:52

వానకాలం సేద్యం వివరాల సేకరణ

వానకాలం సేద్యం 	వివరాల సేకరణ

  • n ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్న ఏఈవోలు
  • n పంట కొనుగోళ్లు, దిగుబడిపై అంచనా
  • n సర్వత్రా హర్షం

సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు జిల్లా రైతులు నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేస్తున్నారు. ఆ దిశగా వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వానకాలంలో సాగవుతున్న పంటల వివరాలు సేకరిస్తున్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేస్తుండడంతో సాగు విస్తీర్ణంతోపాటు దిగుబడి అంచనా తెలుసుకొనే అవకాశం ఉన్నదని వారు చెబుతున్నారు. కొనుగోలు సమయంలో ఏఈవోలు ఈ వివరాల ప్రకారం ధ్రువీకరణ పత్రాలు జారీ చేయనున్నారు. వీటి ఆధారంగా ఉత్పత్తులను విక్రయించి అన్నదాతలకు మద్దతు ధర కల్పిస్తుండగా, సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- వేములవాడ రూరల్‌

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వ్యవసాయ విస్తీర్ణా ధికారులు అన్ని గ్రామాల్లో రైతులు సాగు చేసిన పంటల వివరాలను క్షేత్రస్థాయిలో సేకరిస్తున్నారు. గతంలో రైతులు కొనుగోలు చేసిన విత్తనాల ఆధారంగా సాగు విస్తీర్ణాన్ని అంచనా వేసేవారు. దీంతో క్రయవిక్రయాల సమయంలో ఇబ్బందులు ఏర్పడేవి. తాజాగా ప్రభుత్వం రైతుల వారీగా సాగు విస్తీర్ణం ఆన్‌లైన్‌లో నమో దు చేయాలని ఆదేశించడంతో ఏఈవోలు సాగుకు సంబం ధించిన లెక్కలు తేల్చే పనిలో నిమ గ్నమయ్యారు.

ఆన్‌లైన్‌లో నిక్షిప్తం

పంటల సాగు, వ్యవసాయ స్థితిగతులపై సర్వే నిర్వహిం చాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిం ది. భూ ప్రక్షాళన చేసి, రైతులకు కొత్త పట్టా పాస్‌పుస్తకాలు ఇచ్చినా, రెవెన్యూ, వ్యవసాయ, ముఖ్య ప్రణాళికాధికారి శాఖల మధ్య ఉన్న సాగు భూములు, దిగుబడులు, పం టల సాగు తదితర వివరాల్లో భారీ తేడాలుంటున్నాయి. గత సర్వేలతో సంబంధం లేకుండా ఈ వానకాలంలో రైతులు వారీగా పంటల సాగుకు సంబం ధించిన పూర్తి వివరాలు క్షేత్ర స్థాయిలో సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు.

నమోదు చేసుకుంటేనే కొనుగోళ్లు

రైతులు సాగు చేసిన పంట వివరాలు ఇక పక్కాగా తేల నున్నది. రైతుల వారీగా సర్వే నంబర్‌, సాగు విస్తీర్ణంతోపాటు, వేసిన పంటల రకం, ప్రధాన పంట, అంతర పంటలు, నీటి వసతి, రైతుల మొబైల్‌ నంబర్‌, చివరిలో రైతు సంతకం తీసు కోనున్నారు. ప్రతి రైతు వివరాలు నమోదు చేసుకుంటేనే ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించుకొనే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. తాజాగా సాగు చేసిన పంటల వివరాల పేర్లు ఆన్‌లైన్‌లో ఉంటేనే ప్రభుత్వ కేంద్రాల్లో మద్దతు ధరతో విక్రయించుకొనేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

రైతుల మొబైల్‌కి సమాచారం

సాగు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తర్వాత రైతుల మొబైల్‌ నంబర్‌కు సంక్షిప్త సమచారం పంపిస్తారు. ఏఏ పంట లు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారో సెల్‌కు మేస్సేజ్‌ రానున్నది. గ్రామాల వారీగా రైతు పేరు, పట్టా పాస్‌బుక్‌ నంబర్‌, సర్వే నంబర్‌, తదితర వివరాలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఉన్నాయి. వాటిని అధికారులు కంప్యూటర్‌ నుంచి ఫ్రింట్‌ తీసుకొని, రైతు వారీగా సాగు చేసే పంటల వివరాలు, విత్తన రకాలు, నీటి వసతి, య్రంత పరికరాలు, పశువులు, తదితర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

వివరాలు నమోదు చేసుకోవాలి

పంటల సాగు వివరాలను రైతులు నమోదు చేసుకోవాలి. సాగుకు సంబంధించిన సమాచారం తీసుకునేందుకు మా సిబ్బంది గ్రామాలకు వస్తారు. ఆ సమయంలో రైతులు అందుబాటులో ఉండి సర్వే నంబర్ల వారీగా పంటల వివరాలు నమోదు చేయించుకోవాలి. ఆన్‌లైన్‌ జాబితాల్లో పేర్లు ఉంటే పంట అమ్మకాల్లో ఇబ్బందులు ఉండవు. లేకుంటే రైతులు అమ్ముకొనేందుకు అవకాశం ఉండదు. 

- భాస్కర్‌, డివిజన్‌ వ్యవసాయాధికారి, వేములవాడ