శుక్రవారం 27 నవంబర్ 2020
Rajanna-siricilla - Jul 25, 2020 , 02:52:23

యువనేత రామన్నకు పుట్టినరోజు దీవెనలు

యువనేత రామన్నకు పుట్టినరోజు దీవెనలు

  • కేక్‌లు కట్‌చేసి, మొక్కలు నాటి సంబురాలు
  • అభిమానులు, టీఆర్‌ఎస్‌ నాయకుల ఆశీస్సులు
  • పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు
  • పాల్గొన్న జడ్పీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు 
  • కరీంనగర్‌ జిల్లాలో.. 

తిమ్మాపూర్‌ మండలంలోని మానకొండూర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించగా, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు పాల్గొన్నారు. కేక్‌ను కట్‌ చేసి మొక్కలు నాటారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ తన క్యాంపు కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటి, నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరీంనగర్‌లో మేయర్‌ వై.సునీల్‌రావు ఆధ్వర్యంలో నగరంలోని ఎస్‌బీఎస్‌ ఫంక్షన్‌ హాలులో 50 మంది కార్యకర్తలు రక్తదానం చేశారు. 

జగిత్యాల జిల్లాలో..

జిల్లాకేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించగా, దాదాపు వంద మంది కార్యకర్తలు రక్తదానం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేతోపాటు జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, తదితరులు మొక్కలు నాటారు. మెట్‌పల్లి టీఆర్‌ఎస్‌ పట్టణ కార్యాలయంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కేక్‌ కట్‌ చేసి, మొక్కలు నాటారు. కొడిమ్యాలలో జడ్పీ పాఠశాల విద్యార్థులకు ఎమ్మెల్యే రవిశంకర్‌ నోట్‌ బుక్స్‌ పంపిణీ చేశారు. 

పెద్దపల్లి జిల్లాలో..

జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ ఆధ్వర్యంలో మంథని మున్సిపాలిటీ పరిధిలోని 13 వార్డుల్లో సైరన్‌ మోగించి, 20 వేల మొక్కలు నాటే మహా హరితహారం కార్యక్రమాన్ని పోచమ్మవాడలో మొక్కనాటి ప్రారంభించారు. రామగిరి మండలం చందనాపూర్‌లో కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచారు. మొక్కలు నాటారు. పెద్దపల్లి ఎంపీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పెద్దపల్లి పట్టణంలోని ఎంబీ గార్డెన్‌లో 200 మందికి నల్లా ఫౌండేషన్‌ అధినేత, టీఆర్‌ఎస్‌ నాయకుడు నల్లా మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ తండ్రికి తగ్గ తనయుడిగా జయహో  రామన్న పేరిట ఆయన లఘుచిత్రం ఆడియో క్యాసెట్‌ను ఆవిష్కరించారు. విజయమ్మ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగా బస్సు పాసులను ఎమ్మెల్యే చందర్‌ పంపిణీ చేశారు. ఐటీఐ కళాశాల సమీపంలో మొక్కలు నాటారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో..

సిరిసిల్లలో అన్నపూర్ణ భోజనశాల భవనాన్ని టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు ప్రారం భించారు. నెహ్రూనగర్‌ వైకుంఠధామం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, అదనపు కలెక్టర్‌ అంజయ్య, మున్సిపల్‌ అధ్యక్షురాలు జిందం కళ మొక్కలు నాటి, కేక్‌ కట్‌ చేశారు.