ఆదివారం 29 నవంబర్ 2020
Rajanna-siricilla - Jul 25, 2020 , 02:52:25

44వ పుట్టిన రోజు.. 4 లక్షల మొక్కలు

44వ పుట్టిన రోజు.. 4 లక్షల మొక్కలు

  •  మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా
  • ప్రత్యేక హరితహారం 

సిరిసిల్ల: మంత్రి కేటీఆర్‌ 44వ పుట్టినరోజు సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా హరితహారం నిర్వహించింది. శుక్రవారం అధికారులు డీఆర్‌డీఏ సహకారంతో అన్ని మండలాల ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లాలో సుమారుగా 4లక్షలకు పైగా మొక్కలు నాటారు. గంభీరావుపేట మండలం గోరంట్యాలలో పల్లె ప్రకృతి వనంలో జిల్లా డిప్యూటీ కలెక్టర్‌ అంజయ్య, డీఆర్డీఏ కౌటిల్యారెడ్డి మొక్కలు నాటారు. బోయినపల్లి మండలంలో 25,620, వేములవాడ(రూరల్‌) లో 17,500, వేములవాడలో 40,470, ఎల్లారెడ్డిపేటలో 60,250, ఇల్లంతకుంటలో 47,100, చందుర్తిలో 26,620, వీర్నపల్లిలో 43,645, తంగళ్లపల్లిలో 35,050, ముస్తాబాద్‌లో 34,570, గంభీరావుపేటలో 33,100, రుద్రంగి 14,090, కోనరావుపేటలో 29,085 మొక్కలు నాటారు.