శుక్రవారం 27 నవంబర్ 2020
Rajanna-siricilla - Jul 23, 2020 , 03:03:31

సర్కారు బడుల బలోపేతానికి కృషి

సర్కారు బడుల బలోపేతానికి కృషి

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌: సర్కారు బడుల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో అదనపు కలెక్టర్‌ అంజయ్యతో కలిసి బుధవారం ఆమె విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నదని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ తరగతులకు విద్యార్థులు హాజరై సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు సమయాన్ని వృథా చేసుకోకుండా పుస్తకాలతో చదువుకోవాలని అదనపు కలెక్టర్‌ సూచించారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు ఈనెల 25వ తేదీలోగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తామని డీఈవో రాధాకిషన్‌ తెలిపారు. ఇందులో హెచ్‌ఎం భాగ్యరేఖ, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.

ఇంటి వద్దే చదువుకోవాలి

సిరిసిల్ల రూరల్‌: కరోనా నేపథ్యంలో విద్యార్థులు ఇంటి వద్దే ఉంటూ పాఠ్యపుస్తకాలు చదువుకోవాలని డీఈవో రాధాకిషన్‌ పేర్కొన్నారు. తంగళ్లపల్లిలోని జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో బుధవారం ఆయన జడ్పీటీసీ పుర్మాణి మంజుల, ఎంఈవో రఘుపతితో కలిసి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యను అందిస్తున్నామని వారు తెలిపారు. మండెపల్లి ప్రభుత్వ పాఠశాలలో జడ్పీటీసీ, ఎంపీపీ పడిగెల మానస, సర్పంచ్‌ గనప శివజ్యోతి, ఎంపీటీసీ బుస్స స్వప్న ఆధ్వర్యంలో, మున్సిపల్‌ పరిధిలోని పెద్దూరు ప్రభుత్వ పాఠశాలలో ఎస్‌ఎంసీ చైర్మన్‌ తమ్మటి జీవన్‌, హెచ్‌ఎం దాసరి రవీందర్‌, పరబ్రహ్మమూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించారు. సర్పంచ్‌ అంకారపు అనిత, ఎంపీటీసీ కోడి అంతయ్య, హెచ్‌ఎం దూస గోవర్దన్‌,ఎస్‌ఎంసీ చైర్మన్‌ కందుకూరి రామాగౌడ్‌, పుర్మాణి రాంలింగారెడ్డి, మాజీ సర్పంచ్‌ అం కారపు రవీందర్‌ ఉన్నారు.

డీఈవో విచారణ

తంగళ్లపల్లిలోని ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం గోవర్ధన్‌ ప్రొటోకా ల్‌ పాటించడం లేదంటూ జడ్పీటీసీ మంజుల ఫిర్యాదుతో చేయడం తో డీఈవో రాధాకిషన్‌ ఎంఈవో రఘుపతి, సర్పం చ్‌ అనిత సమక్షంలో విచారణ చేపట్టారు. పునరా వృతం కాకుండా చూస్తానని హెచ్‌ఎం అభ్యర్థన మేర కు చర్యలు తీసుకోవడం లేదని డీఈవో పేర్కొన్నారు. 

సద్వినియోగం చేసుకోవాలి: సిద్ధం వేణు

ఇల్లంతకుంట: ప్రభుత్వం అందిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ వైస్‌ చైర్మన్‌ సిద్ధం వేణు, ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం వారు ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశా రు. విద్యార్థులు ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. ఇందులో సెస్‌ డైరెక్టర్‌ గుడిసె ఐల య్య, సర్పంచ్‌ పరశురాం, ఉప సర్పంచ్‌ సాదుల్‌, ఎంఈవో బన్నా జి, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ మధుకర్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌ రాము లు, సావనపెల్లి రాకేశ్‌ పాల్గొన్నారు.  

ఎల్లారెడ్డిపేట: పలు గ్రామాల్లోని పాఠశాలల్లో విద్యార్థులకు  బుధ వారం పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసినట్లు ఎంఈవో రాజయ్య తెలి పారు. గొల్లపల్లి, పదిరలో సర్పంచులు పాశం సరోజన, కుంబాల వజ్రమ్మ చేతుల మీదుగా పుస్తకాలు పంపిణీ చేశారు. ఎంపీటీసీ ల్యాగల శ్రీనివాస్‌రెడ్డి, ఉప్పుల మల్లేశం, కో ఆప్షన్‌ సభ్యుడు మహ్మ ద్‌ జబ్బార్‌, ఉప సర్పంచ్‌ పెంజర్ల దేవయ్య, దాసరి గణేశ్‌, పాశం దేవరెడ్డి, కొండ ఆంజనేయులు, హెచ్‌ఎం మురళి పాల్గొన్నారు.

వీర్నపల్లి: మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు జడ్పీటీసీ గుగులోత్‌ కళావతి, ఎంపీపీ మాలోత్‌ భూల, ఎంఈవో మంకు రాజయ్య బుధవారం పాఠ్య పుస్తకాలు అందించారు. ఇందులో సర్పంచ్‌ దినకర్‌, ఎంపీటీసీ అరుణ్‌, ఉప సర్పంచ్‌ రవి, ఎస్‌ఎంసీ చైర్మన్లు కళ, తిరుపతి, సంతోష్‌, హెచ్‌ఎంలు దేవేందర్‌, గజన్‌, ఎస్‌వో నీలిమ ఉన్నారు.

గంభీరావుపేట: మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలిక ల పాఠశాలలో విద్యార్థులకు వైస్‌ ఎంపీపీ దోసల లత, పలు గ్రామా ల్లో ఉపాధ్యాయులు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. సర్పంచ్‌ కటకం శ్రీధర్‌, హెచ్‌ఎం గంగారాం, బాలెల్లయ్య ఉన్నారు.