గురువారం 26 నవంబర్ 2020
Rajanna-siricilla - Jul 20, 2020 , 03:30:32

ప్రగతి పథంలో పల్లెలు

ప్రగతి పథంలో పల్లెలు

పల్లెలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయి. స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సర్కారు చేపట్టిన ప్రగతి పనులు సత్ఫలితాలని స్తున్నాయి. ఊరూవాడా కదిలి పల్లెలను పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాయి. ప్రభుత్వం నెలనెలా నిధులు మంజూరు చేస్తున్నది. జూలై నెలకు జిల్లాకు రూ.5.43 కోట్లు విడుదల కాగా, ఆయా గ్రామ పంచాయతీ ఖాతాల్లో నిధులు జమకానున్నాయి. ఈ నిధులతో పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి కావస్తుండడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.  

గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజల సహకారంతో రెండు విడుతలుగా చేపట్టిన ఈ కార్యక్రమం సత్ఫలితాన్నిచ్చింది. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నా, ప్రకటించినట్లే ప్రభుత్వం నెలనెలా నిధులు మంజూరు చేస్తున్నది. జూలై నెలకు జిల్లాకు రూ.5,43 కోట్లు విడుదల చేయగా, ఆయా గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమవుతున్నాయి. మంజూరైన నిధులను జనాభా ప్రాతిపదికన జిల్లా పంచాయతీ అధికారి సర్దుబాటు చేయనున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి కావస్తుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అభివృద్ధే లక్ష్యంగా..

సబ్బండవర్గాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్ర భుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. కరోనా విపత్కర పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా పల్లెల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నది. పల్లె ప్రగతి కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగించేందుకు నెలనెలా నిధులు విడుదల                              చేస్తున్నది. 14వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు కేటాయిస్తుండగా, ఈ సారి మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌లకు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నది. ఇందులో 85శాతం పంచాయతీలకు, 10 శాతం మండల పరిషత్‌లకు,  ఐదు శాతం జిల్లా పరిషత్‌లకు కేటాయించనున్నారు. జనాభా ప్రాతిపదికన మూడు విభాగాల్లో సాధారణ, ఎస్టీ, ఎస్సీల కేటగిరీల వారీగా నిధులు ఖర్చు చేయనున్నారు. ఈ నెలలో విడుదలైన నిధులను మండల, జిల్లా పరిషత్‌లకు కేటాయించి చేయూతనిస్తున్నది. 

జిల్లాకు రూ.5.43 కోట్లు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు ఆదర్శంగా మారుతున్నాయి. స్వ చ్ఛత కోసం పల్లె ప్రజలంతా కలిసికట్టుగా ముందుకొస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నెలనెలా పంచాయతీలకు నిధులు విడుదల చేస్తున్నది. అందులో భాగంగా ఈ నెలలో జిల్లాకు రూ.5,43,14,500 మంజూ రు చేసింది. కరోనా నేపథ్యంలో పల్లెల్లో పారిశు ద్ధ్యం మెరుగుపర్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నారు. హైపోక్లోరైట్‌ ద్రావణం, దోమల నివారణకు బ్లీచింగ్‌ పౌడర్‌ మందులు, ఫాగింగ్‌ మిషన్లు, పవర్‌ స్ప్రేలు కొనుగోలు చేయనున్నా రు. అలాగే ప్రతినెలా చెల్లించాల్సిన విద్యుత్‌ బిల్లు లు, కొనుగోలు చేసిన ట్రాక్టర్ల రుణాలు, పారిశు ద్ధ్య కార్మికుల జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నది.