ఆదివారం 06 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Jul 19, 2020 , 04:18:52

కరోనా లక్షణాలుంటే సంప్రదించాలి

కరోనా లక్షణాలుంటే సంప్రదించాలి

సిరిసిల్ల రూరల్‌: కరోనా అనుమానిత లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలని జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు విజ్ఞప్తి చేశారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల పీహెచ్‌సీ పరిధిలోని అంకిరెడ్డిపల్లె గ్రామాన్ని శనివారం ఆయన సందర్శించారు. కరోనా లక్షణాలున్న వారి కుటుంబ సభ్యులు బహిరంగ ప్రదేశాల్లో తిరగవద్దని, హోం క్వారంటైన్‌లోనే ఉండాలని సూచించారు. మాస్కులు ధరించాలని, చేతులను  తరుచుగా శుభ్రం చేసుకోవాలని, పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. ఎవరికైనా వైరస్‌ అనుమానిత లక్షణాలుంటే క్షేత్ర స్థాయిలోని సిబ్బందికి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సర్వేలైన్స్‌ అధికారిణి డాక్టర్‌ మీనాక్షి, నేరెళ్ల పీహెచ్‌సీ వైద్యాధికారిణి సుప్రియ, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ వెంకటేశం, సూపర్‌ వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.