బుధవారం 25 నవంబర్ 2020
Rajanna-siricilla - Jul 18, 2020 , 02:54:48

వేములవాడ రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు కావడంతో సర్వత్రా హర్షం

వేములవాడ రెవెన్యూ  డివిజన్‌గా ఏర్పాటు  కావడంతో సర్వత్రా హర్షం

  •  సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యే రమేశ్‌బాబు చిత్రపటాలకు పాలాభిషేకం

వేములవాడ: వేములవాడ రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు కావడంతో ఈ ప్రాంత ప్రజలకు పరిపాలన మరింత చేరువవుతుందని ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌, మంజూరుకు కృషి చేసిన మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సం దర్భంగా వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్‌లో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యే రమేశ్‌బాబు చిత్రపటాలకు టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు పుల్కం రాజు, మున్సిపల్‌ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవి పాలాభిషేకం చేశారు. అభివృద్ధి ప్రదాతలుగా నిలుస్తూనే, ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్న ఎమ్మెల్యే రమేశ్‌బాబుకు అందరూ రుణపడి ఉంటారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బూర వజ్రమ్మ, ఏఎంసీ చైర్మన్‌ గడ్డం హన్మండ్లు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మధురాజేందర్‌, సీనియర్‌ నాయకులు ఏనుగు మనోహర్‌రెడ్డి, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ ఊరడి ప్రవీ ణ్‌, కౌన్సిలర్లు మారం కుమార్‌, నరాల శేఖర్‌, యాచమనేని శ్రీనివాసరావు, ఇప్పపూల అజయ్‌, నాయకులు భాస్కర్‌రావు, ప్రసాద్‌రావు, పొలాస నరేందర్‌, కొండ కనుకయ్య, క్రాంతికుమార్‌, సలీం, అంజనీకుమార్‌, శేఖర్‌, నరాల దేవేందర్‌, అంజద్‌పాషా ఉన్నారు. 

చందుర్తి: వేములవాడ రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు కావడంతో మూడపల్లిలో జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ, సర్పంచ్‌ చిలుక అంజిబాబు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఎమ్యెల్యే రమేశ్‌బాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యే రమేశ్‌బాబు ప్రత్యేక చొరవతో రుద్రంగి, చందుర్తి, కోనరావుపేట, బోయినిపల్లి, వేముల వాడ రూరల్‌, వేములవాడ అర్బన్‌ మండలాలతో వేములవాడ రెవెన్యూ డివిజన్‌ ఏర్పడిందన్నారు. ఇందులో ఎంపీపీ బైరగోని లావణ్య, ఎంపీటీసీ దారం కావ్యశ్రీ, ఏఎంసీ చైర్మన్‌ పొన్నాల శ్రీనివాస్‌రావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ తిప్పని శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ పుల్కం మోహన్‌, ఉప సర్పంచ్‌ రవి, పార్టీ మండలాధ్యక్షుడు మరాఠి మల్లిక్‌, ఆర్‌బీఎస్‌ మం డల కన్వీనర్‌ కనకయ్య, కో ఆప్షన్‌ సభ్యుడు కమలాకర్‌, ఈర్లపల్లి రాజు, మ్యాకల ఎల్లయ్య, జువ్వా డి అనిల్‌రావు తదితరులు ఉన్నారు.

కోనరావుపేట: మండల కేంద్రంలో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యే రమేశ్‌ బాబు చిత్రపటాలకు టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు న్యాలకొ ండ రాఘవరెడ్డి పాలాభిషేకం చేశారు. ఇందులో ఎంపీపీ చంద్రయ్యగౌడ్‌, సెస్‌ డైరెక్టర్‌ తిరుపతి, పీఏసీఎస్‌ చైర్మన్లు బండ నర్సయ్య, రామ్మోహన్‌రావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మం తెన సంతోష్‌ నాయకులు ఉన్నారు.

రుద్రంగి: మండల కేంద్రంలో ఎంపీపీ గంగం స్వరూపారాణి, జడ్పీటీసీ గట్ల మీనయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యే రమేశ్‌బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే రమేశ్‌బాబు ప్రత్యేక చొరవతో వేములవాడ రెవెన్యూ డివిజన్‌గా ఏర్పడిందని వారు పేర్కొన్నారు. ఇందులో వైస్‌ ఎంపీపీ పీసరి భూమయ్య, ఏఎంసీ వైస్‌ చెర్మన్‌ ఆకుల భూమ క్క, జమీలా బేగం, నాయకులు మాడిశెట్టి ఆనం దం, గంగం మహేశ్‌, కేసీరెడ్డి నర్సారెడ్డి, దయ్యాల కమలాకర్‌, మంచె రాజేశం, కొమిరె శంకర్‌, పిడు గు లచ్చిరెడ్డి, చెప్యాల గణేశ్‌, మరిగడ్డ సతీశ్‌, మేక ల రాజేందర్‌, ఆకుల గంగారాం, కొమ్ము రవీంద ర్‌, నరేశ్‌నాయక్‌, తలారి నర్సయ్య, పూదరి శ్రీనివాస్‌, ఉప్పులూటి గణేశ్‌ పాల్గొన్నారు. 

సమయం ఆదా 

పనుల నిమిత్తం సిరిసిల్లకు వెళ్లాల్సి వస్తే దుకాణం బంద్‌ చేసుకుని పోయేవాళ్లం. వ్యాపార పనులకు ఇప్పుడు స్థానికంగా కార్యాలయం ఏర్పాటుతో సమయం బాగా ఆదా అవుతది.

- ప్రభాకర్‌, జాత్రగ్రాండ్‌, వేములవాడ

పాలన మరింత చేరువగా..

వేములవాడ పట్టణంలో రెవెన్యూ డివిజన్‌ అధికారి స్థానికంగా ఉండడంతో పరిపాలన మరింత చేరువ అవుతుంది. అన్ని  కార్యాల యాలు అందుబాటులోకి వచ్చాయి. రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుతో మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

- శ్రీనివాస్‌, సాయినగర్‌, వేములవాడ

భూ సమస్యలు పరిష్కారం 

రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయడంతో భూ సమస్యలు తొందరగా పరిష్కారమయ్యే అవకాశం ఉన్నది. పట్టణంతోపాటు పరిసర గ్రామాల రైతులకు సమయం కూడా కలిసివస్తుంది.

- రాజమల్లయ్య, అంబేద్కర్‌ నగర్‌, వేములవాడ