బుధవారం 02 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Jul 17, 2020 , 02:05:58

షెడ్లు వినియోగించుకోవాలి

షెడ్లు వినియోగించుకోవాలి

  • జడ్పీ సీఈవో గౌతంరెడ్డి n చీకోడులో సామూహిక షెడ్ల నిర్మాణానికి భూమి పూజ

ముస్తాబాద్‌: గొర్రెలు, మేకల పెంపకందారులు సామూహిక షెడ్లను వినియోగించుకోవాలని జడ్పీ సీఈవో గౌతంరెడ్డి పిలుపునిచ్చారు. ఉపాధిహామీ పథకంలో భాగంగా చీకోడు గ్రామంలో సామూహిక గొర్రెల షెడ్ల నిర్మాణానికి సర్పంచ్‌ సుజాత, ఎంపీపీ జనగామ శరత్‌రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, ఆర్‌బీఎస్‌ మండల కన్వీనర్‌ కల్వకుంట్ల గోపాల్‌రావుతో కలిసి గురువారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యాదవులకు ప్రభుత్వం సబ్సిడీపై గొర్రెలు అందించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపిందని పేర్కొన్నారు. గ్రామంలో 92 మంది కి చెందిన గొర్రెలు, మేకలు ఒకే చోట ఉండేందుకు గాను షెడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి వినియోగంలోకి తేవాలన్నారు. కార్యక్రమంలో సెస్‌ డైరెక్టర్‌ ఏనుగు విజయరామారావు ఎంపీటీసీ సవిత, ఏఎంసీ చైర్మన్‌ ఉల్లి మల్లేశ్‌ యాదవ్‌, నాయకులు అంజయ్య, రాజయ్య, అక్కరాజు శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సురేందర్‌రావు, ఆంజనేయులు, డీఆర్డీవో కౌటిల్యారెడ్డి, డీపీవో రవీందర్‌, ఏపీడీ కృష్ణ, ఎంపీడీవో మధుసూదన్‌, తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, ఏపీవో మల్లయ్య, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

చిన్నలింగాపూర్‌లో పనులు ప్రారంభం

సిరిసిల్ల రూరల్‌: తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్‌లో సామూహిక గొర్రెల షెడ్ల నిర్మాణ పనులను గురువారం సర్పంచ్‌ మాసిరెడ్డి అవినాష్‌రెడ్డి ప్రారంభించారు. ఉపాధి హమీ పథకంలో భాగంగా పనులు చేపట్టడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. ఇందులో ఎంపీటీసీ బైరినేని రాము, ఉప సర్పంచ్‌ వర్కల ఎల్లవ్వ, పశు వైద్యాధాకారి సంతోష్‌, ప్రత్యేకాధికారి పరశురాం, కార్యదర్శి దాసరి శ్రీహిత, యాదవ సంఘం మండలాధ్యక్షుడు గోట్ల ఐలయ్యయాదవ్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ బండి దేవేందర్‌ యాదవ్‌, శ్యాగ యాదగిరి, పిట్ల రవి, రేగుల అనిల్‌, శ్యాగ దేవేందర్‌, ఏనుగు రాజేశ్వర్‌రావు, మాసిరెడ్డి మల్లారెడ్డి ఉన్నారు.