బుధవారం 25 నవంబర్ 2020
Rajanna-siricilla - Jul 16, 2020 , 02:37:57

బతుకమ్మ చీరకు బ్రాండ్‌ ఇమేజ్‌

బతుకమ్మ చీరకు బ్రాండ్‌ ఇమేజ్‌

 మంత్రి కేటీఆర్‌ చొరవతో నేతన్నలకు ఉపాధి

 సిరిసిల్లకు కోటి చీరల తయారీ ఆర్డర్లు 

n మున్సిపల్‌ అధ్యక్షురాలు జిందం కళ

సిరిసిల్ల టౌన్‌: బతుకమ్మ చీరలకు బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకొచ్చి, నేతన్నలకు ఉపాధి కల్పించేలా మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని మున్సిపల్‌ అధ్యక్షురాలు జిందం కళ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో చేనేత జౌళీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల కొనుగోలు కేం ద్రాన్ని బుధవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. నేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలన్న లక్ష్యం తో మంత్రి కేటీఆర్‌ చేసిన కృషి ఫలితంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు కోటి రూపాయల చీరల తయారీ ఆర్డర్లు వచ్చాయన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్డర్లతో కార్మికులకు చేతినిండా పని దొరుకుతుందని పేర్కొన్నారు. చీరల ఆర్డర్లు వచ్చిన తర్వాత కార్మికుల నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయన్నారు. చీరల ఉత్పత్తి ద్వారా సుమారు 20వేల మందికి పైగా కార్మికులకు ఉపాధి లభిస్తున్నదని పేర్కొన్నారు. ఒక్కో కార్మికుడు ప్రతినెలా కనీసం రూ.16వేల నుంచి రూ.30వేల వరకు సంపాదిస్తున్నాడని చెప్పారు. ప్రభుత్వ సహకారంతో వచ్చే రెండేళ్లలోగా సిరిసిల్ల బతుకమ్మ చీరలకు ప్రత్యేక లోగో, బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. తద్వారా సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమ, కార్మికులు, ఆసాములు, యజమానులకు ప్రత్యేక గుర్తింపుతోపాటు ఉపాధి అవకాశాలు విస్తృతం అయ్యేలా చేస్తామన్నారు. కార్యక్రమంలో చేనేత జౌళీశాఖ ఏడీ అశోక్‌రావు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, కౌన్సిలర్లు రాపెల్లి దినేశ్‌, ఆడెపు సౌజన్య, మ్యాక్‌ సొసైటీల నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు. 

అందరూ భాగస్వాములవ్వాలి

హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములవ్వాలని మున్సిపల్‌ అధ్యక్షురాలు జిందం కళ పిలుపునిచ్చారు.  28 వ వార్డులో గల శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత చీటి నర్సింగారావుతో కలిసి మొక్కలు నాటారు. ఇందులో టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, కౌన్సిలర్‌ పత్తిపాక పద్మ ఉన్నారు.