సోమవారం 03 ఆగస్టు 2020
Rajanna-siricilla - Jul 15, 2020 , 02:25:58

నాటిన ప్రతి మొక్కనూ కాపాడుకుందాం

నాటిన ప్రతి మొక్కనూ కాపాడుకుందాం

  • మున్సిపల్‌ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవి

వేములవాడ: హరితహారంలో భాగంగా పట్టణంలో నాటిన ప్రతి మొ క్కనూ బాధ్యతాయుతంగా కాపాడుకుందామని మున్సిపల్‌ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవి సూచించారు. మంగళవారం పోలీస్‌స్టేషన్‌ నుంచి తెలంగాణ చౌక్‌ వరకు ఉన్న డివైడర్లలో ఆమె మొక్కలను నాటి, మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా అభివృద్ధి వైపు నడిపిస్తూనే, భావితరాలకు కూడా ఆకుపచ్చని తెలంగాణ అందించాలనే సంకల్పంతో హరితహారాన్ని కొనసాగిస్తున్నారన్నారు. మనిషి మ నుగడకు చెట్లే ఆధారమని, ప్రతి ఒక్కరూ మొక్కలను సంరక్షించాలని కో రారు. పట్టణంలో ఇంటింటికీ అందజేస్తున్న మొక్కలను నాటి, కాపాడే బాధ్యతను కాలనీ వాసులు తీసుకోవాలని వివరించారు. కార్యక్రమంలో కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ మధు రాజేందర్‌, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్‌, గోలి మహేశ్‌, యాచమనేని శ్రీనివాసరావు, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ కమలాకర్‌ రెడ్డి, మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌,  నాయకులు అన్నారం శ్రీనివాస్‌, హరీశ్‌, తదితరులు ఉన్నారు. 


logo