శుక్రవారం 27 నవంబర్ 2020
Rajanna-siricilla - Jul 15, 2020 , 02:25:59

కరోనా నివారణకు సహకరించాలి

కరోనా నివారణకు సహకరించాలి

  • జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు 

సిరిసిల్ల టౌన్‌: కరోనా వైరస్‌ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌ రావు తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం ఆశ, నోడల్‌ సూపర్‌వైజర్లు, ఫెసిలిటేటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో గర్భిణులు, చిన్న పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మాస్కులు ధరించాలని తెలిపారు. రక్తహీనత సమస్య ఉన్నవారు పౌష్టికాహారం తీసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో డీపీహెచ్‌ఎన్‌వో దయామని, హెచ్‌ఈ వెంకటేశం, హెచ్‌ఈవో రాజునాయక్‌, తదితరులున్నారు. కాగా, సిరిసిల్ల పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలకు వేములవాడ లయన్స్‌ క్లబ్‌ నిర్వాహకుడు డాక్టర్‌ నాగ రమేశ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్‌-95 మాస్కుల ను జిల్లా కార్యాలయంలో వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.