మంగళవారం 24 నవంబర్ 2020
Rajanna-siricilla - Jul 15, 2020 , 02:26:00

కంపోస్ట్‌ షెడ్లను త్వరగా పూర్తి చేయాలి

కంపోస్ట్‌ షెడ్లను త్వరగా పూర్తి చేయాలి

  • తంగళ్లపల్లి ఎంపీపీ మానస
  • జిల్లెల్లలోని కంపోస్ట్‌ షెడ్‌ పరిశీలన
  • మొక్కలను నాటిన ప్రజాప్రతినిధులు

సిరిసిల్ల రూరల్‌: గ్రామాల్లోని కంపోస్ట్‌ షెడ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని తంగళ్లపల్లి ఎంపీపీ పడిగెల మానస పిలుపునిచ్చారు. ఈమేరకు మంగళవారం తంగళ్లపల్లి మండలం జి ల్లెల్లలో జిల్లాలోనే మొదట పూర్తి అయిన కంపోస్ట్‌ షెడ్‌ను ఆమె పరిశీలించారు. హరితహారంలో భా గంగా మొక్కను నాటి, నీరు పోశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పల్లె ప్రగతి పనులు, లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ప్రతి గ్రామంలో శ్మశానవాటిక, డంప్‌యార్డు, నర్సరీ, కంపోస్ట్‌ షెడ్‌ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. నిర్మాణంలో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నా రు. మంత్రి కేటీఆర్‌ సూచనలకు అనుగుణంగా ప నులు నిర్వహించాలని వివరించారు. కార్యక్రమం లో ఏఎంసీ చైర్‌పర్సన్‌ లింగం రాణి, సర్పంచ్‌ మాట్ల మధు, ఎంపీటీసీ చెన్నమనేని వెంకట్రావు, ఆర్బీఎస్‌ మండల కన్వీనర్‌ కొమ్మెటి రాజిరెడ్డి, సిం గిల్‌ విండో చైర్మన్లు బండి దేవదాస్‌, కోడూరి భా స్కర్‌గౌడ్‌, మాజీ చైర్మన్‌ పబ్బతి విజయేందర్‌ రె డ్డి, మండల కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ తాజొద్దీన్‌, మాజీ ఎంపీపీ పూసపల్లి సరస్వతి, మోర నిర్మల, పడిగెల రాజు, బచ్చపల్లి తిరుపతి, పోచయ్య, రా మచంద్రంతోపాటు తదితరులు పాల్గొన్నారు.