గురువారం 03 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Jul 14, 2020 , 03:37:35

వేములవాడ బల్దియా పరిధిలో 2కోట్లతో అభివృద్ధి పనులు

వేములవాడ బల్దియా పరిధిలో  2కోట్లతో అభివృద్ధి పనులు

  •  1.42కోట్లతో విలీన గ్రామాలకు ప్రాధాన్యం
  •  ముగిసిన టెండర్‌ ప్రక్రియ
  •  వేగంగా పూర్తి కానున్న పనులు

వేములవాడ: పట్టణ ప్రగతే లక్ష్యంగా వేములవాడ పురపాలక సంఘం పరిధిలో 2కోట్లతో అభివృద్ధి పనులు చేపట్ట నున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు సూచన మేరకు విలీన గ్రామాల్లో 1.42కోట్లతో అభివృద్ధి పనులు జరుగనున్నా యి. ఇందులో ప్రధానంగా మురుగు కాలువలు, సీసీ రహదారులు నిర్మించనున్నారు. 14వ ఆర్థిక సంఘం, సాధారణ నిధులతో పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే టెండర్‌ ప్రక్రియ పూర్తి కావడంతో ఇక బల్దియాలో అభివృద్ధి పనులు వేగంగా పూర్తికానున్నాయి.

2కోట్లతో అభివృద్ధి పనులు 

వేములవాడ మున్సిపల్‌ పరిధిలో 2కోట్లతో అభివృద్ధి పనులు జరుగనున్నాయి. 14వ ఆర్థిక సంఘం నిధులు  కోటి 16లక్షల6వేలు కాగా, 15లక్షలు సాధారణ నిధుల నుంచి పనులు చేపట్టనున్నారు. మరో 15లక్షల అభివృద్ధి పనులకు ఆమోదం తెలుపాల్సి ఉన్నది. ఎస్‌ఎఫ్‌సీ గ్రాంట్‌ ద్వారా కూడా 60 లక్షల పనులకు ప్రతిపాదనలు తయారు చేయగా, త్వరలోనే ప్రభుత్వం ఆమోదం తెలుపనుంది. ఇందులో ప్రధానంగా మురుగు కాలువలు, సీసీ రోడ్లు, హరితహారం పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే టెండర్‌ ప్రక్రియ కూడా పూర్తి కాగా, కాంట్రాక్టర్‌తో ఒప్పందం కూడా పూర్తి కావస్తుంది. వారంలోగా పనులు ప్రారంభంకానున్నాయి.

విలీన గ్రామాలకు ప్రాధాన్యం

వేములవాడ మున్సిపల్‌లో విలీనమైన తిప్పాపూర్‌, నాంపల్లి, అయ్యోర్‌పల్లి, శాత్రాజుపల్లి, కోనాయపల్లి గ్రామా ల్లో అభివృద్ధి పనులకు తగిన ప్రాధాన్యమిస్తామని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చా రు. ఇచ్చిన హామీని పురపాలక సంఘం కార్యవర్గంతో అమ లు చేస్తున్నారు. అందులో భాగంగానే తిప్పాపూర్‌లో 34లక్షలతో సీసీ రహదారులు, మురుగు కాలువల నిర్మాణానికి నిధులు కేటాయించారు. నాంపల్లిలోనూ 14లక్షలతో సీసీ రోడ్లు, గొల్లపల్లిలో 6లక్షలతో సీసీ రోడ్లు, ఇస్లాంనగర్‌లో 2లక్షలతో సీసీ రోడ్లు, 4.79లక్షలతో మురుగు కాలువ, సీసీ రహదారి నిర్మాణానికి నిధులు కేటాయించారు. అలాగే 15లక్షలతో కోనాయపల్లిలో కూడా అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా, త్వరలో నిధులు విడుదల కానున్నాయి. శాత్రాజుపల్లిలోనూ 60లక్షలతో ప్రతిపాదనలు తయారు చేయగా, ఎస్‌ఎఫ్‌సీ గ్రాంట్‌ ద్వారా మంజూరుకు సిద్ధంగా ఉన్నాయి. 

వేగవంతం కానున్న పనులు

అభివృద్ధి పనులకు ఇప్పటికే టెండర్‌ ప్రక్రియ పూర్తయ్యింది. మొత్తం 24 పనులకు టెండర్‌ నిర్వహించగా, కాంట్రాక్టర్లతో మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ అధికారులు ఒప్పందాన్ని పూర్తి చేస్తున్నారు. పట్టణంలో వారంలోగా పనులు వేగవంతం చేయనున్నారు. దీంతో వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులు కూడా వేగవంతం కానున్నాయి.

పలు గ్రామాల్లో ఎక్సైజ్‌ దాడులు

ముస్తాబాద్‌: మొర్రాపూర్‌తండా, సేవాలాల్‌తండాల్లో సోమవారం దాడి చేసి 80లీటర్ల బెల్లంపానకం పారబోసి, ఐదు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్‌ సీఐ చంద్రశేఖర్‌ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తండాల్లో గుడుంబా విక్రయించినా, తయారు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందులో సిబ్బంది ఉన్నారు.

నియంత్రిత పద్ధతిలో సాగు చేయాలి

ఇల్లంతకుంట: రైతులు నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయా లని సర్పంచ్‌ జితేందర్‌గౌడ్‌ సూచించారు. పెద్దలింగాపూర్‌లో సోమ వారం గ్రామసభ నిర్వహించారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ సాగు చేయాలన్నారు. ఇందులో ఎంపీటీసీ కరెద స్వప్న, ఉప సర్పంచ్‌ ఎద్దు కుమార్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ గన్నారం వసంత, ఏఎంసీ డైరెక్టర్‌ మీసర గండ్ల అనిల్‌, కేతిరెడ్డి సుధాకర్‌రెడ్డి, ఏఈవో శిరీష ఉన్నారు.