బుధవారం 12 ఆగస్టు 2020
Rajanna-siricilla - Jul 13, 2020 , 01:54:44

‘ఉపాధి’లో సామూహిక షెడ్ల నిర్మాణాలు

‘ఉపాధి’లో సామూహిక షెడ్ల నిర్మాణాలు

తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేసింది. వీటి సంరక్షణకు పెంపకం దారులు ఇండ్ల ఆవరణలో నిర్మించిన షెడ్లతో పరిసరాలు అపరిశుభ్రంగా మారి అంటువాధ్యులు ప్రబలే అవకాశం ఉన్నది. ఇందుకుగాను ఉపాధి హామీ పథకం ద్వారా జీవాలకు ఆవాసం కల్పిస్తు న్నది. సామూహిక షెడ్ల నిర్మాణం చేపట్టడంతో కాపరులకు ప్రయోజనం చేకూరడంతో సర్వత్రా హర్షం వ్యక్తవమవుతున్నది. - వేములవాడ రూరల్‌ యాదవుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం 75శాతం సబ్సిడీతో గొర్రెలు పంపిణీ చేసింది. మొదటి విడుతలో భాగంగా గొల్ల కురుమలకు గొర్రెలు అందజేసింది. దీంతో పల్లెల్లో జీవాల సంఖ్య పెరుగుతున్నది. వాటి రక్షణకు కాపరులు వారి ఇండ్ల ఆవరణలో షెడ్లు నిర్మించుకున్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా మారి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రభుత్వం భావించింది. ఉపాధిహామీ పథకంలో భాగంగా గ్రామ శివారులో ఒకే ప్రదేశంలో సామూహిక షెడ్లు ఏర్పాటు చేసుకొనే అవకాశాన్ని కల్పించింది. గ్రామాల ఎంపిక వేములవాడ, వేములవాడ రూరల్‌ మండలాల్లో అధిక సంఖ్యలో గొర్రెలు, మేకలు ఉన్న గ్రామాలకు ముందుగా ప్రాధాన్యత కల్పించే యోచనలో అధికారులు ఉన్నారు. షెడ్‌ ఏర్పాటుకు ప్రభుత్వ స్థలం లేదా గొర్రెల పెంపకందారుల సొసైటీకి చెందిన భూమిని ఎంపిక చేస్తున్నారు. ఎకరం నుంచి మూడెకరాల భూమిని గుర్తించి గొర్రెల సంఖ్యకు అనుగుణంగా షెడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. సదరు స్థలంలో యూ ఆకారంలో షెడ్లు నిర్మించనున్నారు. పెంపకందారులు ఉదయం గొర్రెలను మేతకు తీసుకెళ్లి సాయంత్రం షెడ్లలో వదిలివెళ్లాలి. వీటి సంరక్షణ బాధ్యత పెంపకందారులదే. వంతుల వారీగా రోజుకు ఇద్దరి చొప్పున కాపలా కాయాల్సి ఉంటుంది. షెడ్ల వద్ద ఉపాధిహామీ పథకంలో భాగంగా తొట్టి నిర్మాణం కూడా చేపట్టనున్నారు. షెడ్ల పరిణమాలు ఇలా.. రెండు రకాలుగా ప్రభుత్వం షెడ్ల నిర్మాణానికి ముందుకొ చ్చింది. మొదటి రకం షెడ్‌ 4.15మీటర్ల పొడవు, 2.20మీటర్ల ఎత్తు, రెండు వైపులా చిన్న గోడలు, 2మీటర్లతో చేపట్టేందుకు 54,140 ఖర్చువుతుంది. రెండోరకం షెడ్‌ విస్తీర్ణం 4.88 మీటర్ల పొడవు, 2.50మీటర్ల ఎత్తు, రెండు వైపులా గొడల ఎత్తు 2.50మీటర్లుగా నిర్మించనున్నది. ఇందుకు 90,490 వరకు ఖర్చు కానుంది.

తాజావార్తలు


logo