శుక్రవారం 07 ఆగస్టు 2020
Rajanna-siricilla - Jul 13, 2020 , 01:42:06

ఇదిగిదిగో మోడ్రన్‌ డ్రైవింగ్‌ స్కూల్‌

ఇదిగిదిగో మోడ్రన్‌ డ్రైవింగ్‌ స్కూల్‌

రాష్ట్రంలోనే తొలి అంతర్జాతీయ డ్రైవింగ్‌ శిక్షణ, పరిశోధనా (ఐడీటీఆర్‌) కేంద్రం సిద్ధమైంది. ఆధునిక హంగులు.. సకల సౌకర్యాలతో రూపుదిద్దుకున్నది. మంత్రి కేటీఆర్‌ చొరవతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులో రూ.16.48 కోట్లతో చేపట్టిన నిర్మాణం నాలుగేండ్లలోనే పూర్తి చేసుకున్నది. 20 ఎకరాల స్థలంలో అధునాతన సౌకర్యాలు.. వసతులతో నిర్మించిన ఈ శిక్షణ కేంద్రం త్వరలోనే ప్రారంభంకాబోతుండగా, జిల్లానే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఆధునిక ప్రమాణాలతో డ్రైవింగ్‌ శిక్షణ అందనున్నది.  

 సిరిసిల్లరూరల్‌: రాష్ట్రంలో చాలా మంది నిరుద్యోగ యు వకులు ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్తున్నారు. డ్రైవింగ్‌ శిక్షణ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమం లో జిల్లాతోపాటు స్వరాష్ట్రంలోని యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన డ్రైవింగ్‌ శిక్షణ అందించి, ఉపాధి చూపాలని మంత్రి కేటీఆర్‌ సంకల్పించారు. అందుబాటులో శిక్షణ కేంద్రం ఉండాలని ఆకాంక్షించారు. ప్రత్యేక చొరవ తీ సుకొని నాలుగేళ్ల కింద రాష్ట్రంలోనే తొలి అంతర్జాతీయ స్థా యి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రైవింగ్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసర్చ్‌ సెంటర్‌ (ఐడీటీఆర్‌)ను మంజూరు చేయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో తంగళ్లపల్లి మండ లం మండెపల్లి శివారులోని 2016లో పనులు ప్రారంభించారు. 20 ఎకరాల స్థలంలో విశాలమైన స్థలంలో రూ. 16.48కోట్ల వ్యయంతో నాలుగేండ్లలోనే పూర్తి చేశారు. కాగా, ఈ శిక్షణ కేంద్రం అశోక్‌ లే లాండ్‌ సంస్థతోపాటు పలు ప్రైవేట్‌ సంస్థల నిర్వహణలో కొనసాగనున్నది. 

అధునాతన సౌకర్యాలు.. 

ఐడీటీఆర్‌లో అధునాతన సౌకర్యాలు కల్పించారు. విశాలమైన స్థలంలో భవనాన్ని జీ+2 లో పద్ధతిలో నిర్మించారు. మూడు బ్లాకులుగా విభజించారు. మెయిన్‌బ్లాక్‌లో ఆరు క్లాస్‌ రూంలు ఏర్పాటు చేశారు. అలాగే అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌తోపాటు వర్క్‌షాప్‌ కోసం ప్రత్యేక బ్లాకు ఏర్పాటు చేశారు. ఇందులో 180 మందికి వసతితో కూడిన శిక్షణ ఇవ్వనున్నారు. వసతి కోసం భవనంలో ప్రత్యేక గదులు నిర్మించారు. కాగా, వసతి గృహంలో ఉండలేనివారికి డే స్కాలర్‌ కింద కూడా శిక్షణ అందిస్తారు. కాగా, భవనం బయట అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో విశాలమైన ట్రాకులు నిర్మించారు. 

రాష్ట్రంలోనే  తొలి కేంద్రం ఇది..

తెలంగాణలోనే తొలి శిక్షణ కేంద్రం ఇది. మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో ఏర్పాటై, ఇటీవలే నిర్మాణం పూర్తిచేసుకున్నది. త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ కేంద్రం ద్వారా నాణ్యమైన డ్రైవర్లను అందించవచ్చు. ఉపాధి అవకాశాలు ఎక్కువ. ఇతర దేశాల్లో  శిక్షణ కేంద్రంలో డ్రైవింగ్‌ శిక్షణ పొందిన వారికి భారీగా డిమాండ్‌ ఉంది. రోడ్డు ప్రమాదాల నివారణతోపాటు ప్రమాదాలు తగ్గుతాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు శిక్షణ పొందవచ్చు. శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన మంత్రి కేటీఆర్‌, భవనం నిర్మాణం పూర్తికి సహకరించిన అధికారులు, అశోక్‌ లే లాండ్‌ సంస్థ ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు. - కొండల్‌రావు, జిల్లా రవాణా శాఖ అధికారి, రాజన్న సిరిసిల్ల

 అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ

ఈ సెంటర్‌ ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన శిక్షణ అందుతుంది. 30 మంది అనుభవజ్ఞులైన శిక్షకులతో అన్ని రకాల డ్రైవింగ్‌లలో తర్ఫీదు ఇస్తారు. ఒకరో జు డ్రైవింగ్‌ కోర్సు శిక్షణతోపాటు ఎల్‌ఎంవీ, హెచ్‌ఎంఎల్‌, ట్యాంకర్స్‌, అంబులెన్స్‌, అత్యవసర సేవలకు వినియోగిం చే వాహనాల దాకా శిక్షణ అందిస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత లైసెన్స్‌తోపాటు ధ్రువీకరణ పత్రాలను అందిస్తారు. ఇతర దేశాల్లో డ్రైవర్‌లకు చాలా డిమాండ్‌ ఉంది. రోడ్డు ప్రమాదాల నివారణతోపాటు నాణ్యమైన డ్రైవింగ్‌ శిక్షణ అంతర్జాతీయ ప్రమాణాలతో అందనుంది.

మెండుగా ఉపాధి.. 

సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ఐడీటీఆర్‌ తెలంగాణలో ఏకైక శిక్షణ కేంద్రం కావడం విశేషం. దేశంలో ఇప్పటివరకు 10 ఉన్నాయి. వీటి ద్వారా ఆయా రాష్ర్టాల్లో అంతర్జాతీయ స్థాయి డ్రైవింగ్‌ శిక్షణ అందుతున్నది. దేశ, విదేశాల్లో ఉపాధి అవకాశాలు మెండుగా దొరుకుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకొని తెలంగాణలోనే తొలి శిక్షణ కేంద్రాన్ని సిరి సిల్లలో ఏర్పాటు చేయించారు. logo