గురువారం 26 నవంబర్ 2020
Rajanna-siricilla - Jul 12, 2020 , 01:30:25

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

  •  డీపీవో రవీందర్‌
  •  పలు గ్రామాల్లో కంపోస్ట్‌ షెడ్‌, డంప్‌యార్డు, శ్మశాన వాటికల నిర్మాణ పనులు పరిశీలన

రుద్రంగి: పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని జిల్లా పంచాయతీరాజ్‌ అధికారి రవీందర్‌ పిలుపునిచ్చారు. మానాల, దేగావత్‌తండా, వీరునితండా గ్రామాల్లో నిర్మిస్తున్న డంప్‌యార్డు, శ్మశానవాటిక, కంపోస్ట్‌ షెడ్‌తో పాటు పలు అభివృద్ధి పనులను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీపీవో మాట్లాడుతూ, గ్రామాల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పచ్చదనం, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నా రు. డంప్‌యార్డు, కంపోస్ట్‌ షెడ్‌, శ్మశానవాటికల నిర్మాణాలు వేగంగా పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని సూచించారు. నిర్మాణ పనుల్లో జాప్యం జరిగితే వేటు తప్పదని హెచ్చరించారు. సీజనల్‌ వ్యాధులను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌ చేపట్టిందన్నారు. చెత్తాచెదారాన్ని తరలించేందుకు కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. పరిసరాల శుభ్రతతోనే వ్యాధులు దరిచేరవని స్పష్టం చేశారు. త్వరలోనే తడి, పొడి చెత్తతో కంపోస్ట్‌ ఎరువుల తయారీపై ప్రజాప్రతినిధులు, అధికారులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. రైతు వేదికలు, కల్లాలు, ప్రకృతివనాల ఏర్పాటుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు తుది దశకు చేరుకోవడంతో సంతృప్తి చెందారు. కార్యక్రమంలో డీఆర్డీవో కౌటిల్యారెడ్డి, ఎంపీపీ గంగం స్వరూపారాణి, జడ్పీటీసీ గట్ల మీనయ్య, వైస్‌ ఎంపీపీ పీసరి భూమయ్య, ఎంపీడీవో శంకర్‌, డిప్యూటీ తహసీల్దార్‌ మల్ల య్య, ఎంపీవో సుధాకర్‌, ఏపీవో అరుణ, ఆర్‌ఐ సునీత, టీఏ ధనుంజయ్‌, ఏపీఎం రాజు, సర్పంచులు అల్లూరి మానస, దేగావత్‌ సరిత, గుగులోత్‌ మేన, నాయకులు గంగం మహేశ్‌, దేగావత్‌ తిరుపతి, జక్కు మోహన్‌, గజన్‌లాల్‌, గుగులోత్‌ మెహన్‌, భూక్యా రాజు పాల్గొన్నారు.