బుధవారం 12 ఆగస్టు 2020
Rajanna-siricilla - Jul 11, 2020 , 01:46:30

హరిత తెలంగాణే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

హరిత తెలంగాణే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

సిరిసిల్ల టౌన్‌: హరిత తెలంగాణే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని మున్సిపల్‌ అధ్యక్షురాలు జిందం కళ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని 5వ వార్డులో శుక్రవారం నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్డులోని రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ, పచ్చదనాన్ని పెంపొందించడానికి అందరూ విరివిగా మొక్కలు నాటాలని కోరారు. ప్రతి ఇంటి ఎదుట పండ్లు, పూల మొక్కలను నాటి సంరక్షించాలని చెప్పారు. కార్యక్రమంలో కమిషనర్‌ సమ్మయ్య, వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, స్థానిక కౌన్సిలర్‌ దార్నం అరుణ, నాయకులు దార్నం లక్ష్మీనారాయణ, గడ్డం భగవాన్‌, సలీం పాల్గొన్నారు. 

అందరూ పాల్గొనాలి

ఇల్లంతకుంట: హరితహారంలో అందరూ పాల్గొని ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చాలని వైస్‌ ఎంపీపీ సుధగోని శ్రీనాథ్‌ గౌడ్‌ కోరారు. శుక్రవారం మండలంలోని వంతడుపులలో ఆయన గ్రామస్తులకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కట్ట వెంకటరెడ్డి, వార్డు సభ్యులు ఎదిరె శేఖర్‌, కట్కూరి యాదగిరి, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

పండ్ల మొక్కల పంపిణీ

ఎల్లారెడ్డిపేట: బొప్పాపూర్‌లో సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు కొండాపురం బాల్‌రెడ్డి  ఆధ్వర్యంలో గ్రామ మహిళలకు శుక్రవారం మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భం గా బాల్‌రెడ్డి మాట్లాడుతూ, మొక్కలు నాటి సంరక్షించా లన్నారు. ఇక్కడ ఇల్లెందుల శ్రీనివాస్‌రెడ్డి, చంద్రారెడ్డి, వీవో మంజుల, రేణుక, యశోద తదితరులు ఉన్నారు. 


logo