బుధవారం 12 ఆగస్టు 2020
Rajanna-siricilla - Jul 11, 2020 , 01:21:21

జ్యోతికి ఖాకీల అండ

జ్యోతికి ఖాకీల అండ

ఎల్లారెడ్డిపేట: పెద్ద దిక్కును కోల్పోయిన జ్యోతికి పోలీసులు అండ గా నిలిచారు. దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న నిరుపేద మహిళకు మేమున్నామంటూ భరోసానిచ్చారు. ఎల్లారెడ్డిపేట మం డలం బొప్పాపూర్‌కు చెందిన జక్కుల శ్రీధర్‌ ఇటీవల కామెర్ల వ్యాధితో మరణించాడు. ఇంటిపెద్ద మృతితో ఆ నిరుపేద కుటుం బం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో ‘జ్యోతికెంత కష్టం’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురిత మైన కథనానికి ఎస్పీ రాహుల్‌హెగ్డే స్పందించారు. దాతలు, సిబ్బంది సహకారంతో రూ. 50 వేలు పోగు చేశారు. శుక్రవారం తన కార్యాలయంలో జ్యోతి కుటుంబానికి చెక్కు, క్వింటాల్‌ బియ్యం. ఇద్దరు చిన్నారులకు దుస్తులు అందజేశారు. అంతకు ముందు దుమాలకు చెందిన మల్లేశం మృతిచెందగా బాధిత కుటుంబానికి అందించారు. ఎల్లారెడ్డిపేటకు చెందిన కొర్రి సోని, ప్రవీణ్‌ తల్లిదండ్రులను కోల్పోగా వారి కుటుంబాలకు నగదు, బియ్యం, నూతన దుస్తులు అందించారు. ఈ కార్యక్రమాల్లో డీఎస్పీ చంద్రశేఖర్‌, ఎస్‌ఐ వెంకటకృష్ణ తదితరులు ఉన్నారు. కాగా పెద్దమనుసుతో ఆర్థిక చేయూతనిచ్చిన ఎస్పీ రాహుల్‌హెగ్డేకు బాధిత కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 

డీజీపీ అభినందనలు

జ్యోతికి పోలీసులు అండగా నిలువడంపై డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందించారు. సేవా కార్యక్రమాలలో ఎస్పీ రాహుల్‌ హెగ్డే, సిబ్బంది ముందుంటున్నారని, గ్రేట్‌ జాబ్‌ అంటూ ట్వీట్‌ చేశారు. 

తాజావార్తలు


logo