బుధవారం 12 ఆగస్టు 2020
Rajanna-siricilla - Jul 11, 2020 , 01:15:07

బహుళ ప్రయోజనకారిగా నారాయణపూర్‌ వంతెన

బహుళ ప్రయోజనకారిగా నారాయణపూర్‌ వంతెన

టీఆర్‌ఎస్‌ సర్కారు ఏం చేసినా పది మందికి పాయిదా ఉంటుంది. బ్రిడ్జి కట్టుమని అడిగితే దాని కింద చెక్‌డ్యాం కూడా కట్టిన్రు. ఎంత మంచి ఇగురమది. చెక్‌డ్యాం కట్టినంక మస్తు నీళ్లు ఆగుతున్నయ్‌. మాకు చాపలు పట్టుకునేతందుకు ఇదివరకే టేకులపల్లి చెరువు ఉన్నది. ఇప్పుడు చెక్‌డ్యాం కూడా చెరువులెక్క కనిపిస్తున్నది. పోయినేడాది 30వేల చేప పిల్లలు పోసినం. ఒక్కొక్కటి కిలన్నర అయినయి. మొన్ననే పట్టినం. నా బుద్దితెల్సినంక వాగుల గంతగనం ఎన్నడు పట్టలె. ఇదంత కేటీఆర్‌ సారు పుణ్యమే. ఆ సారు రుణం మర్చిపోం. చెక్‌డ్యాంను ఇంకొంచెం ఎత్తు పెంచుమని కేటీఆర్‌ సారును అడిగినం. సార్‌ గూడా దాన్ని సూడుమని ఆఫీసర్లకు సెప్పిండు. చానా సంతోషమనిపించింది. 

ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌, ముస్తాబాద్‌ మండలం కొండాపూర్‌ ఇవి ఈ రెండు మండలాల చివరి గ్రామా లు. ఒకదానికొకటి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అయితే ఈ గ్రామాల మధ్య పెద్దవాగుపై వంతెన లేకపోవడం సమస్యగా మారింది. ఏటా వానకాలంలో ఈ వాగు ప్రవహిస్తుండడంతో ఈ రెండూళ్లకే కాదు, పదుల సంఖ్యలో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయేవి. అటోళ్లు ఇటు రావాలన్నా.. ఇటోళ్లు అటు పోవాలన్నా చుట్టూ మూడు, నాలుగు గ్రామాల మీదుగా ఎనిమిది కిలోమీటర్లు తిరిగితే కాని చేరుకోలేని దుస్థితి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉండే కొండాపూర్‌ ప్రజలు.. వంతెన వెతలతో వ్యాపార, వాణిజ్య పనుల కోసం 12కిలోమీటర్ల దూరంలో ఉండే ముస్తాబాద్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఇక్కడ వంతెన నిర్మించాలని దశాబ్దాల నుంచి పాలకులను వేడుకున్నా పరిష్కారం దొరకలేదు. 

మంత్రి కేటీఆర్‌ చొరవ.. తీరిన వెతలు.. 

సమస్యను గుర్తించిన మంత్రి కేటీఆర్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంతెన వెతలు తీర్చారు. అయితే ఇక్కడ బ్రిడ్జి ఒక్కటే కాదు.. వాగు పారుతున్నందున వంతెన కిందే చెక్‌ డ్యాంను నిర్మించి అటు రైతులకు, ఇటు మత్స్యకారులకు మేలు చేయాలని సంకల్పించారు. 2016లో 19.25 కోట్లతో మంజూరు చేయించి, వారధి కం చెక్‌డ్యాం నిర్మించారు. దీంతో రెండు మండలాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడి, ఏళ్లనాటి ‘దారి’ద్య్రం వీడిపోయింది.. 

అరకిలోమీటరు పొడవునా నీరు..
నారాయణపూర్‌లోని వారధి కం చెక్‌డ్యాంతో బహుళ ప్ర యోజనాలు కలుగుతున్నాయి. వంతెన కింద 1.75మీటర్ల ఎత్తులో నిర్మించిన చెక్‌డ్యాం ద్వారా ఏటా వానకాలం వా గులో 400 మీటర్ల పొడవునా నీరు నిలిచి ఉంటున్నది. దీంతో పరిసర ప్రాంత రైతులకు పుష్కలంగా నీరందడంతోపాటు భూ గర్భ జలాలు పైపైకి వస్తున్నాయి. మత్స్యకారులకూ మేలు జరుగుతున్నది. చెక్‌డ్యాంలో చేప పిల్లలు వదిలి, ఉపాధి పొందుతున్నారు. వారధి వ్యూహం ఫలిచిందన్న విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌.. రైతులు, మత్స్యకారుల విజ్ఞప్తి మేరకు చెక్‌డ్యాం ఎత్తును మరో 0.6మీటర్లు పెంచాలని అధికారులను ఆదేశించారు.
    వానత్తె గోసైతుండె.. 
ఆనకాలం అచ్చిందంటె పొలంపనికైన, కార్యాలకైనా మస్తు గోసయితుండె. వాగొడ్డుకు నారాయణపూర్‌కు పత్తేర కైకిలివోవాలంటే నడుంమంటి నీళ్లల్లకెళ్లి పోయత్తుం. భయభయంకొద్ది పనిజేద్దుంటిమి. 20 ఏండ్ల కింద ఓ రోజు మా మేనగోడలు భర్త దుమాలకాడ సచ్చిపోతె ముసురువానల వాగులకెళ్లి పొయ్యెతందుకు ఎన్నితిప్పలు పడ్డమో ఇప్పటికీ మర్సిపోం. వాగుదాటినంక మొత్తంమడుగు, బురదలకెల్లి పోతె దుఃఖం అచ్చింది. ఇప్పుడు కేటీఆర్‌ సార్‌ మంచిగరోడ్డేసి, బ్రిడ్జి కట్టించెపటికె ఎల్లరెడ్డిపేట పోయెతందుకు మంచిగయ్యింది. కేటీఆర్‌ సార్‌ కడుపు సల్లగుండ పనులు మంచిగజేసిండు. -కుర్దుల లక్ష్మి, కొండాపూర్‌.  
మా కష్టాలు తీరినయి.. 
రెండూళ్ల మధ్య వాగు పారి వానకాలంల మస్తు ఇబ్బందయ్యేది. రాకపోకలు ఉండేటియి కాదు. ఇట్ల చానా ఏండ్ల నుంచి నరకం చూసినం. వానకాలం వత్తందంటేనే భయమయ్యేది. ఇక వాగు పారుతుందన్న మాటే గాని ఏం పాయిదా లేకపోయేది. నీళ్లు ఆపి పొలాలకు పెట్టుకునే దారిలేకపోయేది. కానీ, కేటీఆర్‌ సార్‌ దేవుని లెక్క మంచి ఉపాయంతో బ్రిడ్జి కట్టిండు. మా దారి కష్టాలు తీరినయి. వాగుల నీళ్లు ఆగి రైతులకు, చేపలు పట్టెటోళ్లకు మస్తు మేలైతంది. -లింగాల నరేందర్‌, నారాయణపూర్‌  

తాజావార్తలు


logo