బుధవారం 12 ఆగస్టు 2020
Rajanna-siricilla - Jul 10, 2020 , 02:35:03

మొక్కలతోనే మనుగడ

మొక్కలతోనే మనుగడ

  •  జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు n హరిదాస్‌నగర్‌లో మహిళలకు మొక్కల పంపిణీ

ఎల్లారెడ్డిపేట: మొక్కలతోనే మానవాళి మనుగడ సాధ్యమని జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు పేర్కొన్నారు. హరిదాస్‌నగర్‌లో గురువారం ఆయన మహిళా సంఘాల సభ్యులకు మొక్కలు పంపిణీ చేసి మాట్లాడారు. హరితహారంలో భాగంగా ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. చెట్లతోనే భావితరాల ఆరోగ్యానికి రక్షణ ఉంటుందన్నారు. ఇందులో ఎంపీటీసీ ఉప్పుల మల్లేశం, మహిళలు ఉన్నారు. 

గంభీరావుపేట: ముస్తఫానగర్‌ పంచాయతీ ఆవరణలో సర్పంచ్‌ కొక్కు సంధ్యారాణి మహిళా సంఘాల సభ్యులకు పండ్లు, పూల మొక్కలు పంపిణీ చేశారు. ఇందులో ఉప సర్పంచ్‌ నర్సయ్య, మహిళా సంఘాల సభ్యులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు. 

కోనరావుపేట: హరితహారంలో భాగంగా నాగారంలో సర్పంచ్‌ బాస లావణ్య  మహిళలకు మొక్క లు పంపిణీ చేశా రు. ఇందులో సీసీ రవి, సీఏ శ్రీహిత, కార్యదర్శి అఫ్సా నా, వీవో ప్రేమల, మహిళా సం ఘం సభ్యులు ఉన్నారు.

చందుర్తి: అందరూ భాగస్వాములై హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్‌ఐ సునీల్‌ కోరారు. ఎన్గల్‌ గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గురువారం ఆయన మొక్కలు నాటారు. ఇందులో సర్పంచ్‌ లింగంపల్లి సత్తయ్య, ఎంపీటీసీ మాదాసు కవిత, ప్రసాద్‌, ఉప సర్పంచ్‌ మంజుల, మనోహర్‌, కార్యదర్శి పర్శరాములు, వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు.

రుద్రంగి: ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని రుద్రంగి ఐకేపీ సీసీ వెంకటలక్ష్మి కోరారు. మం డల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులు, మహిళలకు మొక్కల పంపిణీ చేశారు. ఇంటింటా మొక్కలు నాటి కాపాడాలని ఆమె కోరారు. మండల కేం ద్రంలో 1,200 మొక్కలు పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే మండల కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో మొక్కలు నాటిన చిన్నారులను కాలనీవాసులు అభినందించారు.logo