బుధవారం 05 ఆగస్టు 2020
Rajanna-siricilla - Jul 09, 2020 , 01:14:57

ప్లాంటేషన్‌ పనుల్లో వేగం పెంచాలి

ప్లాంటేషన్‌ పనుల్లో వేగం పెంచాలి

రాజన్న సిరిసిల్ల, నమస్తే తెలంగాణ: హరితహారంలో భాగం గా అటవీశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్లాంటేషన్‌ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ అంజయ్య అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన అటవీ పరిరక్షణ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అటవీ భూముల్లో చేపడుతున్న ప్లాంటేషన్‌ పనులను త్వర గా పూర్తి చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సహకరించాలని కోరారు. మద్దిమల్ల, నిమ్మపెల్లి గ్రామాల్లో ప్లాం టేషన్‌ పనులను కొందరు గ్రామస్తులు అడ్డుకుంటున్నారని అటవీశాఖ అధికారిణి ఆశా అదనపు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. అటవీశాఖ అధికారులకు సహకరించాలని డీఎస్పీ చంద్రశేఖర్‌ను అదనపు కలెక్టర్‌ ఆదేశించారు. రాత్రివేళల్లో అటవీ ప్రాంత భూములను చదును చేస్తున్న నంబర్‌ ప్లేట్‌ లేని ట్రాక్టర్లను సీజ్‌ చేయాలని ఆర్డీవో శ్రీనివాస్‌కు సూచించారు. సంబంధిత వ్యక్తులపై పీడీ యాక్టు కేసులు నమోదు చేయాలన్నారు. ఇందులో ఎఫ్‌ఆర్వో వేణుగోపాల్‌, ఏఎంవీఐ ప్రమీల, ఎస్‌బీ ఎస్‌ఐ శ్రీనివాస్‌, శైలజ ఉన్నారు. 

అగ్రస్థానంలో ఉండేలా రైతు వేదికలు: అరుణ 

రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉండేలా జిల్లాలో రైతు వేదికలు నిర్మించాలని జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం అదనపు కలెక్టర్‌ అంజయ్య, సం బంధిత శాఖల అధికారులతో కలిసి వేదికల నిర్మాణాల పురోగతిపై ఆమె సమీక్షించారు. జిల్లాలో 57 క్లస్టర్లలో నిర్మిస్తున్న రైతు వేదికలను రెండు నెలల్లో పూర్తి చేయాలన్నారు. మున్సిపల్‌, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ సొంత నిధులతో నిర్మిస్తున్న వేదికలు పురోగతిలో ఉన్నాయని, మిగిలినవి సైతం వేగంగా నిర్మించాలన్నారు. ఇందుకోసం రైతుబంధ సమితి అధ్యక్షులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలన్నా రు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ, వేదికల నిర్మాణాల్లో జాప్యం జరుగకుండా చూడాలన్నారు. వేదికల నిర్మాణ కూలీలు గ్రామాల్లో ఉండేందుకు సరైన వసతులు కల్పించే లా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందులో ఆర్‌బీఎస్‌ జిల్లా కన్వీనర్‌ గడ్డం నర్సయ్య, జిల్లా వ్యవసాయాధికారి రణధీర్‌, డీపీవో రవీందర్‌, డీఆర్డీవో కౌటిల్య ఉన్నారు.logo