ఆదివారం 09 ఆగస్టు 2020
Rajanna-siricilla - Jul 08, 2020 , 02:09:16

అధైర్యపడవద్దు.. అండగా ఉంటాం

అధైర్యపడవద్దు.. అండగా ఉంటాం

గంభీరావుపేట: అధైర్యపడవద్దు.. అన్నివిధాలా అండగా ఉంటామని మంత్రి కేటీఆర్‌ బాధిత కుటుంబాలకు భరోసానిచ్చారు. దమ్మన్నపేట గ్రామానికి చెందిన సింగిల్‌ విండో డైరెక్టర్‌ భూమక్క చంద్రారెడ్డి ఇటీవల మృతిచెందగా, సదరు కుటుంబాన్ని మంత్రి కేటీఆర్‌ మంగళవారం పరామర్శించారు. చంద్రారెడ్డి చిత్రపటానికి పూలమాల మాల వేసి నివాళులర్పించారు. అనంత రం కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ‘టీఆర్‌ఎస్‌ పార్టీ కుటుంబ సభ్యు డు చంద్రారెడ్డి మృతి చెందడం బాధాక రం.. మీ కుటుంబానికి పార్టీ అండగా ఉం టుంది’.. అని మంత్రి కేటీఆర్‌ బాధిత కుటుంబ సభ్యులకు ధీమా కల్పించారు. తర్వాత గ్రామానికి టీఆర్‌ఎస్‌ కార్యకర్త మార్కంటి దేవారెడ్డి మూడు నెలల క్రితం మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పిల్లల చదువులతోపాటు ఆర్థిక సాయం అందిస్తానని పేర్కొన్నారు. అమాత్యుడి వెంట టెస్కాబ్‌ చైర్మన్‌ కొం డూరి రవీందర్‌రావు, సర్పంచ్‌ సిరిగిరి లక్ష్మి, ఉప సర్పంచ్‌ అరుట్ల అంజిరెడ్డి, ఎం పీటీసీ కవిత, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు వెంకటస్వామిగౌడ్‌, నేతలు కొత్తింటి హన్మంతరెడ్డి, రాంరెడ్డి, రాజిరెడ్డి, చంద్రమౌళి, కొమిరిశెట్టి లక్ష్మణ్‌, వంగ సురేందర్‌రెడ్డి, కమ్మరి రాజారాం ఉన్నారు. 

మంత్రికి వినతుల వెల్లువ

వీర్నపల్లి: కంచర్ల, గర్జనపల్లిలో కూడా భూములు సర్వే చేయించి పట్టాలు అందజేయాలని గ్రామస్తులు మంత్రిని కోరారు. కంచర్లకు చెందిన శివరాత్రి రాజు అనారో గ్యం బారిన పడగా చికిత్స కోసం సీఎంఆర్‌ఎఫ్‌ మంజూరు చేయాలని వేడుకోగా, సంబంధించిన పత్రాలను వ్యక్తిగత సహా యకులకు అందించాలన్నారు. బావుసింగ్‌తండా, రంగంపేట, బాబాయిచెరువుతండాకు చెందిన ముగ్గురు ఒమన్‌లో 11 ఏండ్లుగా జైలులో ఉంటున్నారని, స్వగ్రా మానికి రప్పించాలని వేడుకున్నారు. పూర్తి వివరాలతో తన కార్యాలయానికి రావాలని అమాత్యుడు వారికి సూచించారు. గర్జనపల్లిలో మూలవాగుపై వంతెన నిర్మించాలని సర్పంచ్‌ కరుణ మంత్రి విన్నవించారు. 

‘మమ్మల్ని సిరిసిల్లలో కలుపండి’

వీర్నపల్లి: ‘మమ్మల్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలుపండి సార్‌'.. అంటూ నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం తాటిపల్లి గ్రామస్తులు మంత్రి కేటీఆర్‌ను మంగళవారం వేడుకున్నారు. శాంతినగర్‌ వంతెన ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రిని వారు కలిసి వినతిపత్రం అందించారు. తమ గ్రామానికి నిజామాబాద్‌ జిల్లా కేంద్రం సుమారు 80కిలోమీటర్ల దూరం ఉండడంతో వివిధ పనుల కోసం జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ఇబ్బంది అవుతుందన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న సిరిసిల్లలో తమ గ్రామాన్ని కలుపుకోవాలని కోరారు. తాటిపల్లి నుంచి సిరిసిల్లకు 40కిలోమీటర్లు మాత్రమే ఉంటుందని తెలిపారు. స్పందించిన మంత్రి కేటీఆర్‌ ‘మీ ఎమ్మెల్యే ఒప్పుకుంటే మాకేమి ఇబ్బంది లేదు’ అని వారికి చెప్పారు. 


logo