సోమవారం 03 ఆగస్టు 2020
Rajanna-siricilla - Jul 08, 2020 , 02:07:45

సర్వాంగ సుందరంగా రహదారులు

సర్వాంగ సుందరంగా రహదారులు

బోయినపల్లి: స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో అన్ని రహదారులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. బోయినపల్లి-వేములవాడ (7కిలోమీటర్లు) బీటీ రోడ్డు మరమ్మతు కోసం డీఎంఎఫ్‌టీ కింద 2.27కోట్లు మంజూరు కాగా, నిర్మాణ పనులను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాల హయాంలో అప్పటి ప్రజాప్రతినిధులు రోడ్లను పట్టించుకున్న పాపానపోలేదని ఆవేదన చెందారు. ప్రజా సంక్షేమం కోసం ఎప్పుడు ఆలోచించలేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ మాత్రం గ్రామాల్లో కనీస సౌకర్యాలపై ప్రత్యేక దృష్టిసారించి కోట్లాది రూపాయలు విడుదల చేశారని కొనియాడారు. గ్రామాలతోపాటు ప్రధాన రహదారులు ప్రస్తు తం అద్దంలా మెరుస్తున్నాయని చెప్పారు. వేములవాడ రాజన్న ఆలయానికి వెళ్లే భక్తు లు, ప్రజలకు రవాణా సమస్యలు పరిష్కారం కానున్నాయని తెలిపారు. 

రైతు సంక్షేమమే ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. బోయినపల్లిలో పూర్తికావస్తున్న రైతు వేదికను మంగళవారం ఆయన పరిశీలించి, మాట్లాడారు. రైతుల కష్టాలకు విముక్తి పలికేందుకు సీఎం కేసీఆర్‌ రైతుబంధు, రైతు బీమా ప్రవేశపెట్టి ఆర్థిక సాయం అందిస్తున్నారని చెప్పారు. ప్రాజెక్టులు నిర్మాణం పూర్తిచేసి చివరి మడికి సాగునీరు అందిస్తున్నారని కొనియాడారు. పంటల సాగు గురించి అన్నదాతలు సమష్టిగా నిర్ణయాలు తీసుకొనేందుకు రైతు వేదిక చక్కగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇందులో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్‌, పీఆర్‌ డీఈఈ భూమేశ్వర్‌, ఎంపీడీవో రాజేందర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ కొనుకటి నాగయ్య, సర్పం చ్‌ గుంటి లతశ్రీ, ఎంపీటీసీలు సంబ బుచ్చ మ్మ, అక్కెనపల్లి ఉపేందర్‌, కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ అజ్జు, ఏఎంసీ డైరెక్టర్లు సురేందర్‌రెడ్డి, అనిల్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మేడుదుల మల్లేశం, నాయకులు కత్తెరపాక కొండ య్య, సంబ లక్ష్మీరాజం, గుంటి శంకర్‌, ఈడ్గు స్వామి, కవంపల్లి రాములు, డబ్బు సృజన్‌రెడ్డి, ఆనందరెడ్డి, కందుల గంగారెడ్డి, ఎడపల్లి బాబు, బొజ్జ నరేశ్‌ తదితరులు ఉన్నారు.logo