సోమవారం 03 ఆగస్టు 2020
Rajanna-siricilla - Jul 07, 2020 , 02:19:31

వనరులను సమకూర్చుకోవాలి

వనరులను సమకూర్చుకోవాలి

  •  కలెక్టర్‌ శశాంక  n కొవిడ్‌-19పై వైద్యాధికారులతో సమీక్షా సమావేశం

కరీంనగర్‌ హెల్త్‌: కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు, ట్రూ నాట్‌ యంత్రం పని చేసేందుకు అవసరమైన వనరులను, ల్యాబ్‌ టెక్నీషియన్లను సమకూర్చుకోవాలని వైద్యాధికారులను కలెక్టర్‌ శశాంక ఆదేశించారు. కొవిడ్‌-19పై జిల్లా వైద్యాధికారులతో కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి ప్రైమరీ కాంట్రాక్టులను త్వరగా గుర్తించి, వారి నుంచి శాంపిల్స్‌ తీసుకోవాలన్నారు. ఈ విషయంలో డాక్టర్‌ నాగశేఖర్‌, డాక్టర్‌ జ్యోతి బాధ్యత వహించాలని, పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఇన్ఫెక్షన్‌ మూలాలను తప్పకుండా తెలుసుకోవాలన్నారు. మెడికల్‌ షాపుల్లో ఏయే మందులు ఎవరెవరూ కొంటున్నారో తెలుసుకునేందుకు జిల్లా ఫార్మసిస్ట్‌ సంఘాలతో వారానికోసారి సమావేశం నిర్వహించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫీవర్‌ క్లినిక్‌లు యథావిధిగా నిర్వహించాలని, ఇందులో ఐఎల్‌ఐ లక్షణాలున్న వారిని ముందస్తుగా గుర్తించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సిబ్బందితో ప్రతి వారం సమావేశం నిర్వహించాలన్నారు. జిల్లా ప్రభుత్వ దవాఖానలో కరోనా బాధితుల కోసం ప్రత్యేక పడకలు సిద్ధం  చేయాలన్నారు.  అలాగే, పీపీఈ కిట్ల కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానలో అడ్మిట్‌ అయిన వారిలో కరోనా లక్షణాలు లేకపోతే వారిని పది రోజులకు డిశ్చార్జి చేయాలని, లక్షణాలు ఎక్కువగా ఉంటే గాంధీ దవాఖానకు తరలించాలని సూచించారు. ఆక్సిజన్‌ ఉన్న అంబులెన్స్‌, శాతవాహన ఐసొలేషన్‌ సెంటర్‌ అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారిని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో సుజాత, సూపరింటెండెంట్‌ రత్నమాల, డీటీసీవో కేవీ రవీందర్‌రెడ్డి, వైద్యులు రవీందర్‌, వసీం, జ్యోతి, నాగశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు. logo