బుధవారం 12 ఆగస్టు 2020
Rajanna-siricilla - Jul 07, 2020 , 02:19:51

నేడు సిరిసిల్ల జిల్లాకు మంత్రి కేటీఆర్‌

నేడు సిరిసిల్ల జిల్లాకు మంత్రి కేటీఆర్‌

రాజన్నసిరిసిల్ల, నమస్తే   తెలంగాణ : రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం వీర్నపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 11 గంటలకు మండలంలోని కంచర్లలో 33/11కేవీ సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారు. 11.30 గంటలకు రాశిగుట్టతండా నుంచి భూక్యాతండాల మధ్య నిర్మించిన బ్రిడ్జిని, మధ్యాహ్నం 12 గంటలకు మద్దిమల్ల, గుగులోతుతండా బ్రిడ్జి, 12.30 గంటలకు మద్దిమల్ల నుంచి సోమారంపేటను కలిపే బ్రిడ్జిని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు రంగంపేటలో రైతులకు భూమి పట్టాలు పంపిణీ చేస్తారు. గర్జనపల్లిలో 1.30 గంటలకు రైతు వేదిక నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు చీమన్‌పల్లి-వన్‌పల్లి బ్రిడ్జి, 2.30 గంటలకు వన్‌పల్లి-శాంతినగర్‌ బ్రిడ్జిని ప్రారంభించి హైదరాబాద్‌కు తిరిగి పయనమవుతారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.logo