మంగళవారం 11 ఆగస్టు 2020
Rajanna-siricilla - Jul 06, 2020 , 01:32:23

పెద్దలింగాపూర్‌కు కాళేశ్వరం జలాలు

పెద్దలింగాపూర్‌కు కాళేశ్వరం జలాలు

ఇల్లంతకుంట: కాళేశ్వరం 11వ ప్యాకేజీలో భాగంగా రంగనాయక సాగర్‌ ప్రాజెక్టు నుంచి పెద్దలింగాపూర్‌, సిరికొండ గ్రామాల మధ్య ఉన్న పెద్దచెరువుకు గోదావరి జలాలు చేరుకున్నాయి. పెద్దచెరువు నుంచి ఫీడర్‌ చానల్‌ గేటు ద్వారా కొత్త చెరువుకు సర్పంచ్‌ జితేందర్‌గౌడ్‌ నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఆదేశాల మేరకు రంగనాయకసాగర్‌ నుంచి పెద్ద చెరువుకు కాళేశ్వ రం జలాలు చేరుకున్నాయని తెలిపారు. పెద్ద చెరువు తూం ద్వారా పెద్దలింగాపూర్‌లోని కొత్త చెరువుకు నీటి విడుదల చేశామని సర్పంచ్‌ పేర్కొన్నా రు. గోదావరి నీళ్లు గ్రామానికి చేరుకోవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేసి పూజలు చేశారు. ఇందులో ఎంపీటీసీ కరెద స్వప్న, ఉప సర్పంచ్‌ ఎద్దు కుమార్‌, గుర్రాల మల్లారెడ్డి, కరుణాకర్‌ రెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


logo