శుక్రవారం 07 ఆగస్టు 2020
Rajanna-siricilla - Jul 05, 2020 , 00:57:00

ఏడాది పాలన పూర్తిపై ఎంపీపీల సంబురాలు

ఏడాది పాలన పూర్తిపై ఎంపీపీల సంబురాలు

కరీంనగర్‌ రూరల్‌ : కరీంనగర్‌ మండల పరిషత్‌లో ఎంపీపీ, ఎంపీటీసీలుగా ఎన్నికై బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య కేక్‌ కట్‌ చేశారు. శనివారం వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏడాది కాలంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. జడ్పీటీసీ పురుమల్ల లలిత, కరీంనగర్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ పెండ్యాల శ్యామ్‌ సుందర్‌రెడ్డి, దుర్శేడ్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ బల్మూరి ఆనందరావు, తహసీల్దార్‌ గడ్డం సుధాకర్‌, ఎంపీడీవో పవన్‌కుమార్‌, మండల వ్యవసాయ అధికారి సత్యం, ఎంపీవో జగన్‌మోహన్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ వేల్పుల నారాయణ, మండల పంచాయతీ రాజ్‌ డీఈ, ఏఈలు, సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

ఎంపీపీగా ఏడాది పూర్తి 

రామడుగు : ఎంపీపీ పదవి  చేపట్టి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ కలిగేటి కవిత కేక్‌కట్‌ చేసి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మండల అభివృద్ధిలో ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులతో కలిసి ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అంతకుముందు చొప్పదండి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఎంపీపీ కలిగేటి కవిత, లక్ష్మణ్‌ దంపతులను ఎమ్మెల్యే శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సతీశ్‌రావు, వైస్‌ ఎంపీపీ గోపాల్‌, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ జూపాక కరుణాకర్‌, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, ఎంపీటీసీలు గుర్రం దేవిక, వంచ మహేందర్‌రెడ్డి, జవ్వాజి హరీశ్‌, నాయకులు రాజశేఖర్‌గౌడ్‌, కనుకయ్య తదితరులు ఉన్నారు.


logo