బుధవారం 05 ఆగస్టు 2020
Rajanna-siricilla - Jul 02, 2020 , 03:41:18

పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

వేములవాడ రూరల్ : వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్‌రెడ్డి కాలనీలో డీ మిషన్ స్పెయిన్ సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫాదర్ ఇన్నోఅలెక్సీ మాట్లాడుతూ శాంతినగర్ చర్చి సహకారంతో 180 కుటుంబాలకు వెయ్యి రూపాయల విలువైన సరుకులను అందజేశామన్నారు. కార్యక్రమంలో ఫాదర్ ఇన్నారెడ్డి, సిస్టర్ హన్సీ, విన్సెంట్‌రెడ్డి, జోసఫ్‌రెడ్డి  తదితరులు పాల్గొన్నారు. 

తడగొండలో..

బోయినపల్లి : మండలంలోని తడగొండలో బుధవారం అంబేద్కర్ భవనంలో దుబాయి హరిబాబు, మహ్మద్ అలీ, షబాన్ సహకారంతో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వేణు, సర్పంచ్ చిందం రమేశ్, ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్‌గౌడ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.logo