బుధవారం 05 ఆగస్టు 2020
Rajanna-siricilla - Jul 02, 2020 , 03:41:20

భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి

భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి

  • n ఆలయాల్లో ప్రత్యేక పూజలు
  • n గ్రామ దేవతలకు నైవేద్యం సమర్పించి మొక్కులు

సిరిసిల్ల కల్చరల్/ముస్తాబాద్: తొలి ఏకాదశి పం డుగను జిల్లా వ్యాప్తంగా బుధవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఆలయాల్లో భక్తుల రద్దీ తగ్గింది. జిల్లా కేంద్రంలోని శివనగర్ శ్రీ రాజరాజేశ్వర ఆలయం లో ఉదయం 4గంటల నుంచి అభిషేకం, స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. గాంధీనగర్‌లోని రుక్మిణీ విఠలేశ్వరస్వామి, భక్తాంజనేయస్వామి ఆలయాల్లో ఉత్సవాలు నిర్వహించారు. వేంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ముస్తాబాద్ మం డల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లోని ఆలయా ల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామాల్లో పోశమ్మ తల్లికి బోనాలు, నైవేద్యం సమర్పించి మొక్కులు సమర్పించి వన భోజనాలు చేశారు.


logo