బుధవారం 05 ఆగస్టు 2020
Rajanna-siricilla - Jul 02, 2020 , 03:41:20

ఏడో రోజూ.. అదే జోరు

ఏడో రోజూ.. అదే జోరు

(కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల నమస్తే తెలంగాణ/జగిత్యాల): ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏడో రోజు హరితహారం జోరుగా సాగింది. ఊరూరా పెద్ద సంఖ్యలో మొ క్కలు నాటారు. సగటున రోజుకు 20 వేల మొక్కల చొప్పున నాటుతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటూ ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో కలెక్టర్ కే శశాంక, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. మొక్క లు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. చొప్పదండి పట్టణంలో ఎమ్మెల్యే రవిశంకర్, స్థానిక మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజతో కలిసి మొక్కలు నాటారు. మానకొండూర్, చిగురుమామిడి మండలాల్లోని పలు గ్రామాల్లో కూడా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని మానాల, తక్కళ్లపల్లిలో కలెక్టర్ గుగులోతు రవి మొక్కలు నాటారు. మండలంలోని ఎస్సారెస్పీ, వరద కాలువల వెంబడి సంబంధిత అధికారుల సహకారంతో హద్దులు నిర్ణయించాకే గుంత లు తీసి మొక్కలు నాటాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్‌లోని ప్రకృతివనంలో కలెక్టర్ సిక్తాపట్నాయక్ మొక్క నాటారు. సుల్తానాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శాస్త్రీనగర్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో జిల్లా పోలీస్ అధికారులతో కలిసి సీపీ సత్యనారాయణ మొక్క నాటారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు.logo