ఆదివారం 12 జూలై 2020
Rajanna-siricilla - Jul 01, 2020 , 03:28:07

అక్టోబర్‌ కల్లా పూర్తి చేయాలి

అక్టోబర్‌ కల్లా పూర్తి చేయాలి

  • lప్యాకేజీ-9 పనుల్లో జాప్యం వద్దు  
  • lకలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌ lమల్కపేట రిజర్వాయర్‌  పనుల పరిశీలన

కోనరావుపేట: కాళేశ్వర ఎత్తిపోతల పథకం లో భాగంగా చేపట్టిన మల్కపేట రిజర్వాయర్‌ ప్యాకేజీ-9 పనుల్లో జాప్యం లేకుండా వేగంగా నిర్వహించి, అక్టోబర్‌ కల్లా పూర్తి చేయాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ఆదేశించారు. మంగళవారం కో నరావుపేట మండలంలోని మల్కపేట రిజర్వాయర్‌లో నిర్మిస్తున్న సొరంగం, టన్నెల్‌, బండ్‌ ప నులు, సర్జ్‌పూల్‌ మోటర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గంటన్నరకు పైగా సొరంగం మార్గం లో ప్రయాణించి పనుల ప్రగతిపై ఆరా తీశారు. అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నా రు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ప్యాకేజీ-9 పనులకు అవసరమైతే మరింతమంది కార్మికు లు, మిషన్లను సమాకూర్చుకొని పనులు వేగం గా జరిగేలా చూడాలన్నారు. అక్టోబర్‌ కల్లా మొ త్తం పనులు పూర్తయ్యేలా చూడాలని ప్యాకేజీ-9 కార్యనిర్వాహక ఇంజినీర్‌ గంగం శ్రీనివాస్‌రెడ్డి, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లు, గుత్తేదారులకు సూచించారు. ఇంజినీరింగ్‌ అధికారులు తరచూ పర్యవేక్షించాలని, గుత్తేదారులు పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించా రు. మల్కపేట రిజర్వాయర్‌ కుడి, ఎడమ ప్రధా న కాలువలకు భూ సేకరణకు అవసరమైన రూ.35కోట్లు విడుదల చేస్తే పనులు వేగంగా జరుగుతాయని ఈ సందర్భంగా ఈఈ శ్రీనివాస్‌రెడ్డి కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్‌ వెంట ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఈలు సత్యనారాయణ, కిషోర్‌, వినోద్‌కుమార్‌, శ్రీనివాస్‌ ఉన్నారు.

గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యం

రుద్రంగి: గ్రామాల సమగ్రాభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, పచ్చదనం, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పేర్కొన్నారు. మంగళవారం రుద్రంగి మండల కేంద్రంలో పల్లె ప్రగతిలో భాగంగా అభివృద్ధి పనులు డంప్‌ యార్డు, కంపోస్టు షెడ్‌, శ్మశాన వాటికలను పరిశీలించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా డంప్‌యార్డు వద్ద మొక్కను నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పచ్చదనం, పారిశుద్ధ్యంతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో డీఆర్వో కౌటిల్యరెడ్డి, జిల్లా పంచాయతీరాజ్‌ అధికారి రవీందర్‌, ఎస్‌బీఎం అధికారి సురేశ్‌, ఎంపీపీ గంగం స్వరూపారాణి, జడ్పీటీసీ గట్ల మీనయ్య, తహసీల్దార్‌ మహ్మద్‌ తఫాజుల్‌ హుస్సేన్‌, ఎంపీడీవో శంకర్‌, ఎంపీవో సుధాకర్‌, సర్పంచ్‌ తర్రె ప్రభలత, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. 


logo