శనివారం 04 జూలై 2020
Rajanna-siricilla - Jul 01, 2020 , 03:28:27

ఆరో రోజూ.. అదే జోరు

 ఆరో రోజూ.. అదే జోరు

  • ఇంటింటికీ ఐదు మొక్కల పంపిణీ 
  • సదాశివపల్లిలో మొక్కలు నాటిన కలెక్టర్‌ శశాంక 
  • చొప్పదండిలో ఎమ్మెల్యే రవిశంకర్‌ 

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: ఆరో విడుత హరితహారం మంగళవారం ఆరో రోజు జోరుగా కొనసాగింది. జిల్లావ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ వనమహోత్సవంలో పాలుపంచుకున్నారు. పలు గ్రామాల్లో ఇంటింటికీ ఐదు మొక్కలను పంపిణీ చేశారు. ఇండ్ల ఆవరణలో నాటి సంరక్షించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్‌ పరిధిలోని సదాశివపల్లిలో కలెక్టర్‌ కే శశాంక, నగర మేయర్‌ వై సునీల్‌రావు, కమిషనర్‌ క్రాంతితో కలిసి మొక్కలు నాటారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ తన పుట్టిన రోజు సందర్భంగా క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటారు. చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లోని పలు గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు. శంకరపట్నం మండలం తాడికల్‌, మొలంగూర్‌ గ్రామాల్లో మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ మొక్కలు నాటారు. హుజూరాబాద్‌ మండలం కందుగులలో జడ్పీటీసీ సభ్యుడు బక్కారెడ్డి ఇంటింటికీ తిరుగుతూ మొక్కలు అందజేశారు. సైదాపూర్‌ మండలం దుద్దెనపల్లిలో ప్రజాప్రతినిధులు మొక్కలు పంపిణీ చేశారు. తిమ్మాపూర్‌, మహాత్మానగర్‌లో ఎంపీపీ కేతిరెడ్డి వనిత, ప్రత్యేకాధికారి ఖధీర్‌ అహ్మద్‌ గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేశారు. చిగురుమామిడి మండలవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటారు. logo