మంగళవారం 14 జూలై 2020
Rajanna-siricilla - Jun 30, 2020 , 02:35:25

అపర భగీరథుడు సీఎం కేసీఆర్

అపర భగీరథుడు సీఎం కేసీఆర్


  • n టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న n బాలమల్లుపల్లె చెరువు పరిశీలన

సిరిసిల్ల రూరల్: ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథుడు అని టీఆర్‌ఎస్ తంగళ్లపల్లి మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, సిరిసిల్ల పీఏసీఎస్ చైర్మన్ బండి దేవదాస్ కొనియాడారు. కాళేశ్వరం జలాలతో మత్తడి దూకుతున్న బాలమల్లుపల్లెలోని సోమయ్య చెరువును సోమవారం వారు పరిశీలించారు. జలాలకు పూజలు చేసి, నెత్తిన చల్లుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్న ఘనత కేసీఆర్ సర్కార్‌దేనని స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతోనే మెట్ట ప్రాంతమైన సిరిసిల్లలో నేడు గోదావరి జలాలు పరుగులు పెడుతున్నాయన్నారు. రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా మండలంలోని అన్ని చెరువులకు త్వరలోనే జలకళ సంతరించుకోనున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో కస్తూరి తిరుపతిరెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటరెడ్డి, తదితరులు ఉన్నారు.logo