సోమవారం 13 జూలై 2020
Rajanna-siricilla - Jun 30, 2020 , 02:35:38

అన్నింటా ఆదర్శంగా నిలుపాలి

అన్నింటా ఆదర్శంగా నిలుపాలి

  • n ఉపాధిని సద్వినియోగం చేసుకోవాలి 
  • n మొక్కలు నాటి సంరక్షించాలి
  • n మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

ఇల్లంతకుంట: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో మండలాన్ని అన్నిరంగాల్లో ఆదర్శంగా నిలుపాలని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆకాంక్షించారు. మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్‌లో సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులతో ఈజీఎస్, హరితహారంపై నిర్వహించిన సదస్సుకు కలెక్టర్ కృష్ణభాస్కర్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతిఒక్కరూ మొక్కలు నాటి హరితహారం ఆరో విడుతను విజయవంతం చేయాలని కోరారు. వైకుంఠధామాల చుట్టూ, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. రైతులు వ్యవసాయ పనులకు సైతం ఉపాధిహామీ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలో నియోజకవర్గ కార్మిక విభాగం కార్యాలయాన్ని ప్రారంభించారు. శ్రీ రాజరాజేశ్వర జలాశయంలో ముదిరాజ్‌లు మాత్రమే చేపలు పట్టుకొనేలా జీవోను విడుదల చేయాలని మండల మత్స్యకార విభాగం నాయకులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈజీఎస్ ద్వారా ప్రతి గ్రామం లో వైకుంఠధామాలు, కంపోస్ట్ షెడ్లు, పశువుల షెడ్లు, సిమెంట్ కల్లాలు, చేపల చెరువులు, నీటి కుంటలతోపాటు తదితర పనులు చేపడుతున్నామని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముస్కుపల్లిలో విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి సింగిల్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించారు. తర్వాత వల్లంపట్లలో మొగిలి లక్ష్మయ్య ఇటీవల చనిపోగా, బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10వేల ఆర్థిక సాయం అందించారు.

పచ్చదనంతో సమృద్ధిగా వర్షాలు

ప్రతిఒక్కరూ మొక్కలు పెంచినప్పుడే పచ్చదనం పెరిగి వర్షాలు సమృద్ధిగా పడుతామని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నా రు. హరితహారం ఆరో విడుతలో భాగంగా ముస్కుపల్లిలో ఆమర మొక్కలు నాటారు. ప్రతిఒక్కరూ కనీసం ఐదు మొక్కలు నాటినప్పుడే హరితహారం విజయవంతం అవుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, సీఈవో గౌతంరెడ్డి, ఎంపీపీ వెంకటరమణారెడ్డి, సెస్ డైరెక్టర్ గుడిసె ఐలయ్య, వైస్‌ఎంపీపీ శ్రీనాథ్‌గౌడ్, ఎంపీడీవో అమరేందర్ రాజు, డీఆర్డీవో కౌటిల్యారెడ్డి, డీపీ వో రవీందర్, ఏపీడీ నర్సయ్య, తహసీల్దార్ రాజిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు తిరుపతిరెడ్డి, అనంతరెడ్డి, ఆర్‌బీఎస్ మండల కన్వీనర్ రాజిరెడ్డి, ఏపీ ఎం వాణిశ్రీ, ఏపీవో సబిత, సర్పంచులు మల్లయ్య, అనసూర్య, ఎంపీటీసీ స్రవంతి పాల్గొన్నారు.


logo