గురువారం 09 జూలై 2020
Rajanna-siricilla - Jun 30, 2020 , 02:36:27

రాజన్నకు చిల్లర చిక్కులు

రాజన్నకు    చిల్లర చిక్కులు

  • n హుండీ నగదును తీసుకునేందుకు ముందుకురాని బ్యాంకులు
  • n నాలుగు మాసాల క్రితం లెక్కింపు
  • n రెండు కోట్ల వరకు హుండీల్లో నగదు నిల్వలు

వేములవాడ రాజన్నను దర్శించుకొనేందుకు భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు. మొక్కులు చెల్లించుకున్న తర్వాత హుండీల్లో నగదు వేస్తారు. అయితే బ్యాంకర్లు చిల్లర నగదును తీసుకొనేందుకు ముందుకు రావడం లేదు. నాలుగు నెలలుగా హుండీని లెక్కించక పోవడంతో, ప్రస్తుతం రెండు కోట్ల వరకు నగదు నిల్వ ఉంటుందని ఆలయ అధికారులు చెబుతున్నారు.

వేములవాడ: వేములవాడ రాజన్నకు చిల్లర చిక్కులు వెం టాడుతున్నాయి. దక్షిణకాశీగా పేరుగాంచిన రాజన్నను దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు వస్తుంటారు. కోరిన కోర్కెలు తీరిన తర్వాత స్వామివారికి హుండీల్లో నగదు వేసి మొక్కులు చెలించుకుంటారు. దాదాపుగా స్వామివారికి సాలీనా 22కోట్ల వరకు హుండీల ద్వారా నగదు సమకూరుతుండడం భక్తుల్లో ఉన్న విశ్వాసానికి నిదర్శనం. స్వామివారికి హుండీ ల్లో వస్తున్న నగదు ఆదాయంతోపాటు చిల్లర కూడా సమకూరుతుండడంతో బ్యాంకులు వాటిని తీసుకు నేందుకు ముందుకు రావడంలేదు. ఫిబ్ర వరి 12న చివరి సారిగా హుండీని లెక్కించారు. తర్వాత కరోనా నేపథ్యంలో నాలుగు నెలలుగా హుండీ లెక్కించలేదు. దీంతో స్వామివారి హుండీల్లో దాదాపుగా 2కోట్ల వరకు నగదు నిల్వలు చేరుకున్నాయి. లాక్‌డౌన్ అనంతరం ఇటీవల స్వామి వారి ఆలయాన్ని పునఃప్రారంభించారు. హుండీ లెక్కిం పునకు హాజరై నగదును తీసుకోవాలని కోరుతున్నా బ్యాంకు అధికారులు ముందుకు రావడం లేదంటూ ఆలయ పరిపాలన విభాగం అధికారులు వెల్లడిస్తున్నారు. 

సాలీనా 22కోట్ల ఆదాయం

వేములవాడ రాజరాజేశ్వర స్వామివారికి భక్తులు హుండీల ద్వారా సమర్పించే కానుకలతో సాలీనా 22కోట్ల వరకు సమకూ రుతుంది. రాజన్న ఆలయం, అనుబంధ ఆలయాలతో కలిపి నెలలో రెండు సార్లు హుండీని లెక్కిస్తారు. ప్రతిసారి లెక్కింపు సమయంలో 1.75కోట్ల వరకు ఆదాయం సమకూరుతుండగా దాదాపుగా 22కోట్ల వరకు స్వామివారికి ఆదాయం సమకూరుతున్నది.  

ముందుకు రాని బ్యాంకులు

స్వామివారికి హుండీల ద్వారా దాదాపు ప్రతిసారి కోటి75లక్షల వరకు ఆదాయం సమకూరుతుంది. అయితే ప్రతి లెక్కింపులో సుమారు 5నుంచి 10లక్షల వర కు, రూపాయి నుంచి 10రూపాయల చిల్లర నాణెలు కూడా వస్తున్నాయి. హుండీ లెక్కింపునకు వేములవాడ పట్టణం లోని ప్రధాన ఐదు బ్యాంకులకు రొటేషన్ పద్ధతిలో ఆదాయాన్ని జమచేస్తారు. హుండీ లెక్కింపు సమయంలో ఆలయ ఉద్యోగుల తో పాటు బ్యాంకు ఉద్యోగులు కూడా హాజరై నగదును ఇక్కడే లెక్కించి తీసు కుంటారు. చిల్లర పెద్ద మొత్తంలో వస్తుండగా బ్యాంకులు ముందుకు రావడంలేదు. ఒక్కో బ్యాంకులో సుమా రు 30నుంచి 50లక్షల వరకు చిల్లర  పేరుకపోవడంతోనే ముందుకు రావడం లేదని తెలుస్తున్నది. బ్యాంకు నుంచి ఖాతా దారులు వాటిని తీసుకోకపోవడంతో నగదు నిల్వలు పేరుకపోయి లావాదేవీలకు ఇబ్బందులు ఎదురవు తున్నాయని బ్యాంకు అధికారులు వెల్లడిస్తున్నారు. అకౌంట్స్ విభాగం సహాయ కార్య నిర్వహణాధికారి ఉమారాణి ఆలయం పున: ప్రారంభంలోనే హుండీ లెక్కించేందుకు బ్యాంకు అధికారుల సమయం కోరా మని వారు ముందుకు రాకపోవడంతోనే లెక్కింపును వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ నెల 24నుంచి 26 వరకు హుండీని లెక్కించాల్సి ఉండగా, బ్యాంకర్లు ముందుకు రాకపోవడంతో మరో సారి వాయిదా వేశారు.logo