సోమవారం 23 నవంబర్ 2020
Rajanna-siricilla - Jun 29, 2020 , 01:23:51

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

రాజన్న సిరిసిల్ల, నమస్తే తెలంగాణ: వానకాలంలో వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అన్నారు. మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు క్లీన్‌ చాలెంజ్‌లో భాగంగా ఆదివారం ఆయన కలెక్టర్‌ కార్యాలయంలో ఆర్డీవో శ్రీనివాసరావు, డీపీఆర్వో దశరథం, ఇతర అధికారులతో కలిసి పరిసరాలు శుభ్రం చేశారు. ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కేటాయించి ఇంటితోపాటు పరిసరాలు శుభ్రం చేసుకోవాలని సూచించారు. క్లీన్‌ చాలెంజ్‌లో అందరూ భాగస్వాములవ్వాలని కోరారు. వానకాలం వర్షపు నీరు పరిసరాల్లో నిలిచి దోమలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు ప్రజలంతా స్వచ్ఛత వైపు అడుగులు వేయాలన్నారు. పరిసరాల్లో నీరు నిలి చి ఉండకుండా శుభ్రం చేసుకోవాలని సూచించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్య వంతమైన సమాజాన్ని నిర్మించుకోవచ్చన్నారు. 

స్వచ్ఛతతోనే ఆరోగ్యం

వేములవాడ: స్వచ్ఛతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని మున్సిపల్‌ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవి పేర్కొన్నారు. క్లీన్‌ చాలెంజ్‌లో భాగంగా మున్సిపల్‌ సముదాయంలోని నీటితొట్టిని శుభ్రపర్చారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే సీజనల్‌ వ్యాధులను అరికట్టవచ్చన్నారు. ఇందులో వైస్‌చైర్మన్‌ మధు రాజేందర్‌, కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, సెస్‌ డైరెక్టర్‌ రామతీర్థపు రాజు, కౌన్సిలర్లు యాచమనేని శ్రీనివాస్‌రావు, గోలి మహేశ్‌, నాయకులు వంగాల శ్రీనివాస్‌, అన్నారం శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.