శుక్రవారం 03 జూలై 2020
Rajanna-siricilla - Jun 29, 2020 , 01:12:59

వేములవాడలో సాధారణ రద్దీ

వేములవాడలో సాధారణ రద్దీ

వేములవాడ కల్చరల్‌: వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం సాధారణ భక్తులతో కనిపించింది. భక్తులు డిసిన్ఫ్‌క్షనల్‌ టన్నెల్‌ ద్వారా లోపలికి ప్రవేశించి భౌతికదూరం పాటిస్తూ క్యూలైన్‌లో వేచిఉన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. రాజన్నకు సుమారు 1700మంది భక్తులు దర్శించుకోగా, వివిధ అర్జిత సేవల ద్వారా రూ.70,720 ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు వెల్లడించారు.

భక్తులకు ఆన్‌లైన్‌లో పూజలు

కొవిడ్‌-19 నేపథ్యంలో ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న ఆలయ స్థానాచార్యు లు అప్పాల బీమాశంకర్‌ ఆధ్వర్యంలో అర్చకులు ఆదివారం పూజలు నిర్వ హించారు. భక్తుల గోత్రనామాలపేర అద్దాల మండపంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు అభిషేక, అన్న, కుంకుమ పూజలతో పాటు నిత్య కల్యాణం, చండీహోమం, సత్యనారాయణ వ్రతం, లింగార్చన కార్యక్రమా లు  నిర్వహించారు. 


logo