బుధవారం 08 జూలై 2020
Rajanna-siricilla - Jun 28, 2020 , 03:10:16

పట్టణ ప్రగతి పనులకు ఆమోదం

పట్టణ ప్రగతి పనులకు ఆమోదం

  • lకౌన్సిల్ సమావేశంలో పట్టణాభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు
  • lహరితహారానికి రూ. 50 లక్షలు
  • lమున్సిపల్ అధ్యక్షురాలు మాధవ

వేములవాడ : వేములవాడ పురపాలక సంఘంలో రూ. 1.10 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చైర్‌పర్సన్ మాధవి అన్నారు.  శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా  మాధవి మాట్లాడుతూ.. పట్టణ ప్రగతిలో భా గంగా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు వేములవాడ పురపాలక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 2.13 కోట్ల నిధులను విడుదల చేసిందన్నారు. ఇందులో కలెక్టర్ అనుమతితో నీటి సరఫరా సామగ్రి కొనుగోలు, విద్యుత్ బకాలు చెల్లింపులు చేశామన్నారు. మిగిలిన 1.10 కోట్ల నిధులను పట్టణ ప్రగతి పనులకు కేటాయించామన్నారు. రూ.14 లక్షలతో మొక్కల కొనుగోలు, రూ. 24 లక్షలతో ట్రీగార్డులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మొత్తానికి మొక్కల సంరక్షణకు రూ. 50 లక్షల నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. పట్టణ శివారు ప్రాంతాల్లో వీధి దీపాల ఏర్పాటుకు రూ. 12లక్షలు, రెండో బైపాస్ రోడ్డులో  ఓపెన్ జిమ్ వద్ద పిల్లల పార్కును నిర్మిస్తామన్నారు. పట్టణంలో పారిశుద్ధ్యం, హరితహారం అవసరాలకు 20 లక్షలతో నూతన వాహనాల కొనుగోలుకు నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. రూ. 2.50 లక్షలతో తిప్పాపూర్ బస్టాండ్ ఎదురుగా జంక్షన్ సుందరీకరణ చేపడుతామన్నారు. డంప్‌యార్డులో విద్యు త్, ఇతర అవసరాలకు రూ. 5లక్షల నిధులు కేటాయించామన్నారు. అభివృద్ధి పనులకు సభ్యులు సహకరించాలని కోరారు. సమావేశంలో కమిషనర్ మట్ల శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ మధు రాజేందర్, ఏఈలు నర్సింహాస్వామి, శ్రావణ్‌కుమార్ కౌన్సిలర్లు, సిబ్బంది ఉన్నారు.logo