గురువారం 02 జూలై 2020
Rajanna-siricilla - Jun 28, 2020 , 03:10:17

ఆమ్‌చూర్.. పులుపు

ఆమ్‌చూర్.. పులుపు

  • lచింతకు ప్రత్యామ్నాయంగా మామిడి టంకర్ 
  • lమహారాష్ట్రలో అధికంగా వినియోగం

సిరిసిల్ల : పులుపు కోసం చింతకు బదులుగా వాడే ఆమ్ చూర్‌కు భలే గిరాకీ ఉంది. ప్రకృతి వైపరీత్యాలతో రాలిన మామిడి కాయలను టంకరగా తయారుచేస్తారు. ఈదురుగాలులకు రాలిన కాయలను ఒక చోట చేర్చి వాటిని ముక్కలుగా కోస్తారు. ఎండలో ఆరబెడతారు. పూర్తిగా ఎండిన తర్వాత వాటిని నిజామాబాద్ మార్కెట్ యార్డుకు తరలిస్తారు. అక్కడ వ్యాపారులు కొని, మామిడిని పిండిగా పట్టించి (ఆమ్‌చూర్‌గా) విక్రయిస్తారు. చింతకు ప్రత్యామ్నాయంగా చాలామంది ఆమ్‌చూర్‌ను వినియోగిస్తుంటారు. మహారాష్ట్రలో ఆమ్‌చూర్‌తో చేసిన వంటకాలకు ఆదరణ ఎక్కువగా ఉంది. 


logo