శుక్రవారం 03 జూలై 2020
Rajanna-siricilla - Jun 27, 2020 , 02:23:23

ప్రతివార్డునూ పచ్చగా మారుద్దాం

ప్రతివార్డునూ పచ్చగా మారుద్దాం

  • పురపాలక సంఘం అధ్యక్షురాలు మాధవి 
  • కొనసాగుతున్న ఆరో విడత హరితహారం 
  • స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న ప్రజలు

వేములవాడ : వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని ప్రతి వార్డునూ పచ్చగా మారుద్దామని మున్సిపల్‌ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవి అన్నారు. శుక్రవారం ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇందిరానగర్‌ కాలనీలో కౌన్సిలర్‌ నిమ్మశెట్టి విజయ్‌, ప్రజలతో కలిసి మొక్కలు నాటి ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు.  భావితరాలకు ఆకుపచ్చని తెలంగాణ అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ మధురాజేందర్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ఏనుగు మనోహర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డం హన్మాండ్లు, సెస్‌ డైరెక్టర్‌ రామతీర్థపు కృష్ణవేణి, గోలి మహేశ్‌, శ్రీనివాసరావు, నాయకులు పుల్కం రాజు, అన్నారం శ్రీనివాస్‌, వంగళ శ్రీనివాస్‌, సదానందం ఉన్నారు. 

మొక్కలు నాటడం సామాజిక బాధ్యత

బోయినపల్లి : మొక్కలు నాటడం సామాజిక బాధ్యతగా గుర్తించాలని ఎంపీడీవో నల్ల రాజేందర్‌రెడ్డి కోరారు. శుక్రవారం మండలంలోని 23 గ్రామాల్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు కార్యదర్శులు ఉన్నారు. మొక్కలు నాటిన అనంతనం ఎంపీడీవో మాట్లాడుతూ.. నాటిన మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. గ్రామస్తులు స్వచ్ఛందంగా భాగస్వాములైతేనే హరితహారం విజయవంతం అవుతుందని చెప్పారు. కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి తిలక్‌ తది తరులు ఉన్నారు.

 పలు గ్రామాల్లో మొక్కల పంపిణీ

రుద్రంగి : మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఎంపీపీ గంగం స్వరూపారాణి, జడ్పీటీసీ సభ్యుడు గట్ల మీనయ్య మహిళా సంఘాల సభ్యులకు, మహిళలకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ గంగం స్వరూపారాణి మాట్లాడుతూ నాటిన మొక్కలను సంరక్షించి హరిత తెలంగాణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.  గ్రామ ప్రజలకు పూలు, పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. మండలంలో సుమారు 3వేల మొక్కలు పంపిణీ చేసినట్లు చెప్పారు. వైస్‌ ఎంపీపీ పీసరి చిన్నభూమయ్య, తహసీల్దార్‌ మహ్మద్‌ తఫాజుల్‌ హుస్సేన్‌, ఎంపీడీవో శంకర్‌, సర్పంచులు తర్రె ప్రభలత, అల్లూరి మానస, ఎంపీటీసీ మంచె లావణ్య, కోఆప్షన్‌ సభ్యులు మహ్మద్‌ జమీలా బేగం, ఎంపీవో సుధాకర్‌, ఐకేపీ ఏపీఎం రాజు, ఏపీవో అరుణ, నాయకులు గంగం మహేశ్‌, తర్రె మనోహర్‌, మంచె రాజేశం, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

విజయవంతం చేయండి

చందుర్తి : ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేడీసీసీబీ డైరెక్టర్‌ జలగం కిషన్‌రావు సూచించారు. శుక్రవారం చందుర్తి మండలం సనుగుల సింగిల్‌ విండో కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కరుణాకర్‌, ఎంపీటీసీ వేణు, సీఈవో వర్ధన్‌, వైస్‌ చైర్మన్‌ గోపాల్‌, డైరెక్టర్లు శంకరయ్య, పూల్‌సింగ్‌, నాగిరెడ్డి, అజయ్‌, పకిడే గోపాల్‌, వుగిలే సత్యం, నర్సారెడ్డి, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. logo