బుధవారం 08 జూలై 2020
Rajanna-siricilla - Jun 27, 2020 , 02:25:16

స్పీకర్‌, మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం

స్పీకర్‌, మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం

ముస్తాబాద్‌: మండలంలోని ఆవునూర్‌, తుర్కపల్లి గ్రామ శివారు మానేర్‌ ఒడ్డున గురువారం మెగా ప్లాంటేషన్‌ కార్యక్రమానికి వచ్చిన  శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మున్పిపల్‌, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌కు  టీఆర్‌ఎస్‌ శ్రేణులు పూల మొక్కలు, శాలువాలు కప్పి ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో వాగు శివారులో పర్యటించి మొక్కలు నాటారు. ఆవునూర్‌  పూర్తి వ్యవసాయ కుటుంబాలు ఉన్న గ్రామమని, జిల్లాలోనే వరి ఉత్పత్తుల్లో అగ్రస్థానంలో ఉందని, విత్తనశుద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలని  కోరుతూ సర్పంచ్‌ బద్ధి కళ్యాణి  మంత్రి కేటీఆర్‌కు విన్నవించగా స్పందించిన ఆయన ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. గ్రామానికి చెందిన చెందిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు చేపూరి రాజయ్య మంత్రి కేటీఆర్‌, స్పీకర్‌ శ్రీనివాస్‌రెడ్డికి అభివాదం చేయగా వారు సైతం గౌరవపూర్వకంగా నమస్కరించారు. గ్రామానికి చెందిన చేపూరి కృష్ణవేణి, అక్షిత, మనీశ్‌ మంత్రి , స్పీకర్‌తో సెల్ఫీలు తీసుకున్నారు.  కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ స్పీకర్‌ శ్రీనివాస్‌రెడ్డికి జ్ఞాపిక అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, టెస్కాబ్‌ చైర్మన్‌ రవీందర్‌రావు, జడ్పీచైర్‌పర్సన్‌ నాల్యకొండ అరుణ, సెస్‌ చైర్మన్‌ లక్ష్మారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ శంకరయ్య, ఎంపీపీ శరత్‌రావు, జడ్పీటీసీ  నర్సయ్య, సహకార సంఘం అధ్యక్షుడు తన్నీరు బాపురావు, సర్పంచులు కళ్యాణి, పద్మ, ఎంపీటీసీ లలిత, నాయకులు ఏనుగు వేణు, రవీందర్‌, భాను, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌, మహిళా సంఘం సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.logo