శుక్రవారం 10 జూలై 2020
Rajanna-siricilla - Jun 26, 2020 , 01:53:18

ప్రతి ఒక్కరూ ఐదు మొక్కలు నాటాలి

ప్రతి ఒక్కరూ ఐదు మొక్కలు నాటాలి

కొడిమ్యాల:  ప్రతి ఒక్కరూ ఐదు మొక్కలు నాటాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పిలుపునిచ్చారు. పూడూర్‌లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.  అనంతరం ఆరెపల్లి ప్రభుత్వ పాఠశాలలో ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు.  ఎంపీపీ స్వర్ణలత, జడ్పీటీసీ ప్రశాంతి, రేంజర్‌ లత, తహసీల్దార్‌ రవీందర్‌, ఎంపీడీవో రమేశ్‌, సర్పంచ్‌ పెద్ది కవిత, ఎంపీటీసీ రాఘవరెడ్డి, విండో చైర్మన్లు రవీందర్‌రెడ్డి, రాజనర్సింగరావు, నాయకులు పెద్ది రవి, రేకులపల్లి సతీశ్‌రెడ్డి, రమేశ్‌, అంజన్‌కుమార్‌, రాజేశం పాల్గొన్నారు. 

హరితహారం తెలంగాణకు మణిహారం

జగిత్యాల : హరితహారం తెలంగాణ రాష్ర్టానికి మణిహారంగా నిలుస్తుందని జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత అన్నారు.  జగిత్యాల రూరల్‌ మండలం చల్‌గల్‌, తాటిపెల్లిలో  మొక్కలు నాటారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దామోదర్‌రావు, ఎంపీపీ గంగారాంగౌడ్‌, పాక్స్‌ చైర్మన్‌ మహిపాల్‌ రెడ్డి, సర్పంచ్‌ గంగనర్సు రాజన్న, రత్నమాల, శంకర్‌, ఎంపీటీసీ శ్రీను, మాజీ సర్పంచ్‌ సత్యం, జడ్పీ సీఈవో శ్రీనివాస్‌, ఎక్సైజ్‌ సీఐ, ఎస్‌ఐ, ఎంపీడీవో, ఏపీవో, వార్డు సభ్యులు, గౌడ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. logo