శనివారం 04 జూలై 2020
Rajanna-siricilla - Jun 26, 2020 , 01:11:49

‘లక్ష’ణంగా నాటుదాం..

‘లక్ష’ణంగా  నాటుదాం..

n నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో  మెగా ప్లాంటేషన్‌

n ఒక్కరోజే లక్షకు పైగా మొక్కలు నాటే కార్యక్రమం

n మానేరు వాగు వెంట 53 వేల మొక్కలు

n ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌, స్పీకర్‌ పోచారం

మానేరు వెంట  53 వేల మొక్కలు

మానేరు వాగు వెంట 35 కిలో మీటర్ల మేర ఒకే రోజు 53 వేల మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌, తంగళ్లపల్లి మండలాల పరిధిలో ఎగువ మానేరు పరీవాహక ప్రాంతం ఉండగా, రావి, జువ్వి, మద్ది, మర్రి, తదితర మొక్కలు నాటేందుకు గుంతలు తీయించారు. మంత్రి కేటీఆర్‌, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, మొత్తంగా ఒక్క రోజే 1,15,050 మొక్కలను విజయవంతంగా నాటడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

సిరిసిల్ల : జిల్లావ్యాప్తంగా శుక్రవారం లక్షకు పైగా మొక్కలు నాటేందుకు అధికారయంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మెగాప్లాంటేషన్‌ పేరుతో ముస్తాబాద్‌ మండలం ఆవునూరు-ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌ సరిహద్దులో గల మానేరు తీరంలో నిర్వహించే కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్‌, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించనున్నారు. జిల్లాలో 54 లక్షలకు పైగా మొక్కలు నాటాలని వివిధ శాఖలు లక్ష్యాలు విధించుకోగా, శుక్రవారం ఒక్కరోజే లక్షకుపైగా మొక్కలు నాటనున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో ఒక్కో మండలంలో 5 వేల మొక్కల చొప్పున 62 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా విధించుకున్నారు. మొదటి రోజు కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటాలని అధికారయంత్రాంగం కోరుతున్నది. 

విజయవంతం చేయండి

జిల్లాలో శుక్రవారం నిర్వహిస్తున్న మెగా ప్లాంటేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పిలుపు నిచ్చారు. కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్‌ , ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌, శాసన సభా స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. ఆవునూరు- వెంకటాపూర్‌ సరిహద్దులో గల మానేరు తీరంలో మొక్కలు నాటిన అనంతరం ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో అర్బన్‌ అటవీ పార్క్‌కు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ప్రజలు కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.                - కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌


logo