గురువారం 09 జూలై 2020
Rajanna-siricilla - Jun 25, 2020 , 01:54:46

ప్రతి గ్రామంలో 20 వేల మొక్కలు

ప్రతి గ్రామంలో 20 వేల మొక్కలు

ముస్తాబాద్‌:  ఈ నెల 26న మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్న మెగా హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని ఆవునూరు, తుర్కపల్లి, రామలక్ష్మణులపల్లి, కొండాపూర్‌లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం ఒకేరోజు ప్రతి గ్రామంలో 20 వేల మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు, అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ శరత్‌రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, డీఆర్డీవో కౌటిల్యరెడ్డి, ఏపీడీ కృష్ణ, ఎంపీడీవో మదన్‌మోహన్‌, ఇన్‌చార్జి తహసీల్దార్‌ విజయ్‌, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు 

రాజన్న సిరిసిల్ల, నమస్తేతెలంగాణ: నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వ్యాపారులపై  కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ఎస్పీ రాహుల్‌హెగ్డే హెచ్చరించారు. కలెక్టరేట్‌ చాంబర్‌లో బుధవారం విత్తనాలు, ఎరువుల విక్రయాలపై వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్‌, ఎస్పీ సమీక్షించారు. నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలను అరికట్టేందుకు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌, వ్యవసాయ శాఖ అధికారి నేతృత్వంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్సు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం మధ్యమానేరు జలాశయం భూసేకరణపై రెవెన్యూ అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు.  మధ్య మానేరు భూ సేకరణ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయశాఖ అధికారి రణధీర్‌రెడ్డి, పోలీసు అధికారులు, ఆర్డీవో శ్రీనివాసరావు, ఓఎస్డీ మనోహర్‌, తహసీల్దార్‌ అంజన్న, ఇరిగేషన్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు. logo