బుధవారం 02 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Jun 24, 2020 , 02:40:27

బద్దిపోశమ్మకు ఘనంగా పూజలు

బద్దిపోశమ్మకు ఘనంగా పూజలు

వేములవాడ కల్చరల్‌ : ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని మంగళవారం వేములవాడ రాజన్న అనుబంధ ఆలయమైన శ్రీబద్దిపోశమ్మ అమ్మవారికి భక్తులు ఘనంగా పూజలు చేశారు. క్యూలైన్లలో భౌతికదూరం, మాస్కులతో ఆలయంలోనికి ప్రవేశించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, పోలీస్‌ సిబ్బంది కొవిడ్‌-19 నిబంధనలను కచ్చితంగా అమలు చేశారు.  భక్తులను ముందుగా థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన అనంతరం ఆలయంలోనికి అనుమతిం చారు. భక్తులు క్యూలైన్ల ద్వారా అమ్మవారిని ద ర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 

రాజన్నకు ఆన్‌లైన్‌లో భక్తుల పూజలు  

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న భక్తులకు ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ ఆధ్వర్యంలో అర్చకులు మంగళవారం పూజలు నిర్వహించారు. రాజన్న ఆల య అర్చకులు భక్తుల గోత్రనామాల పేరిట  మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హుండీ లెక్కింపు వాయిదా

బుధవారం నుంచి శుక్రవారం వరకు రాజ న్న ఆలయంలో నిర్వహించే హుండీ లెక్కింపును అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.