గురువారం 02 జూలై 2020
Rajanna-siricilla - Jun 24, 2020 , 02:40:31

‘అక్రమ వెంచర్లను తొలగిస్తాం’

‘అక్రమ వెంచర్లను తొలగిస్తాం’

వేములవాడ రూరల్‌ : వేములవాడ మండల పరిధిలోని గ్రామాల్లో ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్లను  తొలగిస్తామని డీఎల్‌పీవో మల్లికార్జున్‌ స్పష్టం చేశారు. మంగళవారం వేములవాడ మండలం రుద్రవరం గ్రామశివారులో ఏర్పాటు చేసిన వెంచర్లను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డీఎల్‌పీవో మాట్లాడుతూ ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా వెంచర్లను ఏర్పాటు చేసుకోవాలని తప్పనిసరిగా డీటీసీపీ లేఅవుట్‌ ఉంటేనే వెంచర్లకు అనుమతులు ఉంటాయన్నారు. ఈ క్రమంలో ఓ వెంచర్‌ కోసం  ఏర్పాటు చేసిన హద్దులను తొలగించగా తాము డీటీసీపీ అనుమతి కోరామని పత్రాలను అందజేస్తామని నిర్వాహకులు చెప్పగా వెంటనే పత్రాలను అందజేయాలని సూచించారు. ఆయన వెంట ఎంపీవో శ్రీధర్‌, ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌, నాయకులు స్వామి, హరికృష్ణ, రాజు, శ్రీనివాస్‌ ఉన్నారు. 

నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు

బోయినపల్లి : ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమ అమలులో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని డీఎల్‌పీవో మల్లికార్జున్‌ చెప్పారు. మంగళవారం మండలంలోని వెంకట్రావ్‌పల్లి, కొత్తపేట, మాన్వాడ, వరదవెల్లి గ్రామాల్లో  మొక్కలు నాటే  పనులను పరిశీలించారు. అనంతరం మాన్వాడ జలాశయం కట్ట కింద స్థలం చూసి మొక్కలు నాటించాలని కార్యదర్శులకు సర్పంచులకు సూచించారు. మండల పంచాయతీ అధికారి గంగాతిలక్‌, సర్పంచులు నందయ్య, ల్యాద నవిత,  లత, కార్యదర్శులు షబానా, భాగ్యలక్ష్మి, జైపాల్‌రెడ్డి ఉన్నారు.

ఇద్దరు కార్యదర్శులకు మెమోలు

హరితహారం పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కొత్తపేట, మాన్వాడ కార్యదర్శులకు డీఎల్‌పీవో మల్లికార్జున్‌ మంగళవారం మెమోలు జారీ చేశారు. 24 గంటల్లో సమాధానం చెప్పాలని సూచించారు.logo