గురువారం 09 జూలై 2020
Rajanna-siricilla - Jun 23, 2020 , 00:48:15

హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాలి

  హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాలి

  • పారిశుద్ధ్యం లోపిస్తే చర్యలు తప్పవు
  •  డీఎల్‌పీవో మల్లికార్జున్‌ 
  •  ప్రజాప్రతినిధులతో సమావేశం

వేములవాడ రూరల్‌: గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎల్‌పీవో మల్లికార్జున్‌ హెచ్చరించారు. సోమవారం వేములవాడ మండల పరిషత్‌ కార్యాలయం లో ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎల్‌పీవో మాట్లాడుతూ, పల్లెలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈనెల 25నుంచి ఆరో విడుత హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతుందని, మారుపాక గుట్ట సమీపంలో ఒకేరోజు 5వేల మొక్కలను నాటేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు. హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు. మండలంలో 99వేల మొక్కలను నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో ని పారిశుద్ధ్య కమిటీ సభ్యులు, పాలకవర్గ సభ్యులు ఇంటిం టా తిరుగుతూ వర్షం నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఏ గ్రామంలోనైనా డెంగీ వ్యాధి వస్తే ఆ గ్రామానికి సంబంధించిన పంచాయతీ కార్యదర్శితోపాటు ప్రజాప్రతినిధులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. జూన్‌ 30వరకు అన్ని గ్రామాల్లో శ్మశానవాటిక, కంపోస్ట్‌ షెడ్‌ నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. వానకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిచాలని కోరారు. పురాతన భవనాలను తొలగించాలన్నారు. గ్రామాల్లోని పారిశుద్ధ్య, హరితహారంలో చేపట్టిన పనులను పంచాయతీ కార్యదర్శులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సర్పంచుల ఫోరం కన్వీనర్‌ ఊరడి రాంరెడ్డి డీఎల్‌పీవో మల్లికార్జున్‌ను వేడుకున్నారు. ముంపు గ్రామాల్లో డ్రైనేజీ సమస్య ఉందని, దానిని పూర్తిస్థాయిలో పరిష్కరించాలని కోరారు. సమావేశంలో ఎంపీపీ బూర వజ్రమ్మ, ఎంపీడీవో నరేశ్‌ ఆనంద్‌, ఎంపీవో శ్రీధర్‌, ఏపీవో ఆనంద్‌, సర్పంచులు చెన్నమనేని స్వయంప్రభ, రేగులపాటి రాణి, వెంకటరమణ, లక్ష్మారెడ్డి, నాయకులు వేణు, రాములు, రాజు తదితరులు పాల్గొన్నారు. 


logo