మంగళవారం 07 జూలై 2020
Rajanna-siricilla - Jun 23, 2020 , 00:48:13

కరోనాపై అప్రమత్తంగా ఉండాలి

కరోనాపై అప్రమత్తంగా ఉండాలి

వేములవాడ రూరల్‌: కరోనా వైరస్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ బూర వజ్రమ్మ పేర్కొన్నారు. సోమవారం మారుపాక గ్రామంలో సర్పంచ్‌ చెన్నమనేని స్వయంప్రభ ఆధ్వర్యంలో చేపట్టిన మాస్కుల పంపిణీ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాస్కులు పంపిణీ చేసి మాట్లాడారు. కరోనా వైరస్‌ ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తలు  పాటించాలని చెప్పారు. భౌతిక దూరం పా టించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌, నాయకులు బూర బాబుతోపాటు వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 

వైద్యశాఖ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ

రుద్రంగి: మండలకేంద్రంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏఎన్‌ఎంలు రాజేశ్వరి, విజయ సోమవారం మాస్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


logo