శనివారం 05 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Jun 21, 2020 , 00:54:17

అపర భగీరథుడు కేసీఆర్‌

అపర భగీరథుడు కేసీఆర్‌

  • రైతు బిడ్డ సీఎం కావడం మన అదృష్టం 
  • నియంత్రిత సాగు చేయాలి
  • జడ్పీ అధ్యక్షురాలు అరుణ 
  • మండల సమావేశానికి హాజరు

ముస్తాబాద్‌: అపర భగీరథుడు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో బీడు భూములు గోదావరి జలాలతో సస్యశ్యామలం అవుతున్నాయని జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ స్పష్టం చేశారు. రైతుబిడ్డ సీఎం కావడంతోనే సబ్బండవర్గాల ప్రజల సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఎంపీపీ జనగామ శరత్‌రావు అధ్యక్షతన శనివారం నిర్వహించిన మండల పరిషత్‌ సర్వసభ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన కర్నల్‌ సంతోష్‌బాబు ఆత్మకు శాంతిచేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం సభ్యులను ఆమె మాట్లాడారు. ఉమ్మ డి పాలనలో ఉపాధిలేక వలస వెళ్లిన రైతాంగం ప్రస్తుతం స్వగ్రామాలకు చేరుకొని కాళేశ్వరం జలాలతో వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. దేశం లో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌ సర్కార్‌దేనని స్పష్టం చేశారు. రైతులు కేసీఆర్‌ ఆలోచనా విధానానికి అనుగుణంగా నియంత్రిత సాగు చేయాలన్నారు. ఎంపీపీ మాట్లాడుతూ, మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. త్వరలోనే ఉపాధిహామీ పథకం ద్వారా ఎగువ మానేరు కాలువలు శుభ్రం అవుతున్నాయని పేర్కొన్నారు. ఆరో విడుత హరితహారానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ వానకాలం నుంచి 771మంది రైతులకు రైతుబంధు అదనంగా రానున్నదని చెప్పారు. అనంతరం సభ్యులు పలు సమస్యలను సభా దృష్టికి తీసుకురాగా, అధికారులు సమాధా నం చెప్పారు. సమావేశంలో గ్రంథాలయ జిల్లా చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, జడ్పీటీసీ గుండం నర్సయ్య, సహకార సంఘాల చైర్మన్లు తన్నీరు బాపురావు, అన్నం రాజేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ యాది మల్లేశ్‌యాదవ్‌, సర్పంచులఫోరం అధ్యక్షుడు కిషన్‌రావు, జడ్పీసీఈవో గౌతంరెడ్డి, డీఆర్డీవో కౌటిల్యారెడ్డి, ఇన్‌చార్జి ఎంపీడీవో మధుసూదన్‌, ఇన్‌చార్జి తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.